
తాజా వార్తలు
ఢాకా: బంగ్లాదేశ్ టీ20, టెస్టు సారథి షకిబ్ అల్ హసన్ టీమిండియాతో సిరీసుల్లో ఆడటం అనుమానమే! ఐసీసీ ఆజ్ఞల మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అతడిని క్రికెట్ కార్యకలాపాలకు దూరంగా ఉంచింది. కనీసం సాధన సైతం చేయనీయడం లేదు. ఓ అవినీతి పరుడు అతడిని సంప్రదించిన విషయం ఐసీసీకి వెల్లడించలేదని ఓ పత్రిక ప్రచురించడమే ఇందుకు కారణం.
ఆరోపణలు నిజమైతే దాదాపు 18 నెలలు షకిబ్‌పై ఐసీసీ నిషేధం విధించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం నెలకొన్న సమస్యలకు తోడు బీసీబీకి ఇదో అదనపు సమస్యగా మారింది. నవంబర్ 3 నుంచే భారత పర్యటన మొదలవ్వనుంది. ‘ఐసీసీ ఆదేశాల మేరకే షకిబ్‌ను బీసీబీ సాధనకు దూరంగా ఉంచింది. సన్నాహక మ్యాచుల్లో ఆడకపోవడానికి, డే/నైట్ టెస్టుపై సమావేశానికి ఆలస్యంగా రావడానికి ఇదే కారణం’ అని సమకాల్ పత్రిక రాసింది.
ప్రస్తుతానికి షకిబ్‌పై బహిరంగ వ్యాఖ్యలు చేయడానికి ఐసీసీ నిరాకరిస్తోంది. రెండేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు బుకీ ఒకరు షకిబ్‌ను సంప్రదించాడని ఆ పత్రిక రాసింది. ఈ విషయాన్ని అతడు ఐసీసీ అవినీతి నిరోధ విభాగానికి వెల్లడించలేదని పేర్కొంది. ఐసీసీ అధికారులు ఈ మధ్యే విచారించగా షకిబ్ ఈ విషయాన్ని అంగీకరించాడని తెలిపింది. మీర్పూర్ సన్నాహక మ్యాచ్, సాధన శిబిరానికి హాజరవ్వని షకిబ్ భారత పర్యటనకు రావడంపై అనుమానాలు నెలకొన్నాయి. అతడి గైర్హాజరీలో ముష్ఫికర్ రహీమ్ టెస్టులు, మొసాదిక్ హుస్సేన్ టీ20లకు సారథ్యం వహిస్తారని తెలుస్తోంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
