
తాజా వార్తలు
విజయవాడ: ఆంధ్రరాష్ట్రం కోసం ఎందరో మహానుభావులు పోరాడారని.. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని సీఎం జగన్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత దగా పడలేదన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, స్పీకర్ తమ్మినేని సీతారామ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పారు. పదేళ్లుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్ తరాలు బాగుపడేలా నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు బాగుపడేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని నిరూపించుకుందామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అందరూ కలిసి రావాలని జగన్ పిలుపునిచ్చారు.
ఈ రాష్ట్రానికి గవర్నర్గా ఉండటం నాకు గర్వకారణం
గొప్ప సంస్కృతి ఉన్న రాష్ట్రానికి గవర్నర్గా ఉండటం గర్వంగా ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పల్లవులు, చాళుక్యులు పాలించిన గొప్ప నేల ఆంధ్రప్రదేశ్ అని.. స్వాతంత్ర్యోద్యమంలో ఈ రాష్ట్రానిది కీలక పాత్ర అంటూ కొనియాడారు. ఎంతో మంది మహానుభావులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల పాలిట సింహ స్వప్నమయ్యారని చెప్పారు. విజయవాడ నగరాన్ని మహాత్మాగాంధీ ఆరుసార్లు సందర్శించారని గవర్నర్ గుర్తు చేశారు. విజయవాడ వాసి పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి గర్వకారణంగా నిలిచారని బిశ్వభూషణ్ కొనియాడారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- ఆ పాత్రకు అరవిందస్వామి అనుకున్నారట!
- ఎంజీ విద్యుత్తు కారు విశేషాలు ఇవే..
- ఇంటి వరకూ తోడుగా వస్తారు!
- మీ షేర్లు భద్రపర్చుకోండిలా..!
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ఎందుకా పైశాచికం?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
