close

తాజా వార్తలు

హరీశ్‌రావుకు రూ.50లక్షల స్వీయ జరిమానా

దుబ్బాక: ఓ కార్యక్రమానికి ఆలస్యంగా హాజరైనందుకుగానూ తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు స్వీయ జరిమానా విధించుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధులకు చెత్తబుట్టలను అందజేసే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ఆలస్యంగా రావడంతో తనకు తానుగా రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు. ఆ మొత్తంతో ఆధునిక హంగులతో మహిళా భవనాన్ని నిర్మిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ మేరకు నిధులను త్వరలోనే విడుదల చేస్తామని పేర్కొన్నారు. స్వచ్ఛ దుబ్బాకగా మార్చేందుకు మహిళా ప్రతినిధులు ముందుకు రావాలని కోరారు. తడిపొడి చెత్తను వేసేందుకు రూ.3 కోట్లతో డంపింగ్‌ యార్డు మంజూరు చేశామని ఈ సందర్భంగా హరీశ్‌రావు వెల్లడించారు. సిద్ధిపేట తరహాలోనే దుబ్బాకను కూడా అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.