close

తాజా వార్తలు

టిక్‌టాక్‌పై అమెరికా విచారణ అస్త్రం!

భద్రతా పరమైన కారణాల రీత్యా...

వాషింగ్టన్‌: అనతికాలంలో ఎనలేని క్రేజ్‌ సంపాదించుకున్న చైనాకు చెందిన ‘టిక్‌టాక్‌’ యాప్‌పై అమెరికా విచారణ ప్రారంభించనుంది. జాతీయ భద్రతా ప్రమాణాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్‌ ద్వారా రాజకీయ సంబంధ సున్నిత సమాచారం ఏదైనా పక్కదారి పడుతుందేమోనన్న కారణంగా ఈ విచారణ జరగనుంది. దీంతో పాటు వ్యక్తిగత సమాచారాన్ని ఈయాప్ స్టోర్‌ చేసే విధానాలపైనా దృష్టి పెట్టనుంది. అమెరికాలో ‘టిక్‌టాక్‌’కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య, టెక్‌ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ, యూఎస్‌లో టిక్‌టాక్‌ యూజర్ల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. యూఎస్‌లో 26.5మిలియన్ల యూజర్లు ఉండగా.. అందులో 60శాతం మంది 16-24 ఏళ్ల మధ్య వయసువారే. అంతే కాకుండా దీన్ని ఉపయోగించే వారి సంఖ్య ప్రతినెలా పెరిగిపోతూనే ఉంది. దీంతో యూఎస్‌లోని విదేశీ పెట్టుబడుల కమిటీ విచారణ జరపాలని నిర్ణయించుకుంది. మరోవైపు ఈ వార్తలపై ‘టిక్‌టాక్‌’ స్పందించింది. ప్రస్తుతం దీనిపై ఇప్పుడప్పుడే చెప్పలేమని తెలిపింది. వినియోగదారుల నమ్మకాన్ని పొందడమే తమ ప్రథమ ఉద్దేశమని వెల్లడించింది. విచారణకు సహకరిస్తామని తెలిపింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.