
తాజా వార్తలు
హైదరాబాద్: అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్ జాతీయ పురస్కారం 2018 సంవత్సరానికి గాను దివంగత నటి శ్రీదేవికి దక్కింది. 2019 ఏడాదికిగాను ఈ అవార్డు నటి రేఖకు వరించింది. ఈ అవార్డుకు సంబంధించిన వివరాలను టి.సుబ్బరామిరెడ్డితో కలిసి టాలీవుడ్ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున మీడియా సమావేశంలో ప్రకటించారు. నవంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డులను అందించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై అవార్డులను అందించనున్నట్లు తెలిపారు. అలాగే అదేరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ‘అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా’ మూడో కాన్వకేషన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి నటి రేఖ ముఖ్య అతిథిగా వ్యవహరించనున్నారు.
సినీ పరిశ్రమకు అక్కినేని నాగేశ్వరరావు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది పరిశ్రమలోని సినీ ప్రముఖులను గుర్తించి ఏఎన్నార్ అవార్డును అందించడం జరుగుతోంది. 2006లో తొలిసారిగా ఈ అవార్డును దేవ్ ఆనంద్‌కు అందించారు. 2017 సంవత్సరంలో ఈ అవార్డు దర్శకధీరుడు రాజమౌళిని వరించింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ట్రైనీ ఐపీఎస్ సస్పెన్షన్
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
