close

తాజా వార్తలు

మెట్రోలో రూ.50 లక్షలు పట్టుకున్న అధికారులు

దిల్లీ : ఎలాంటి పత్రాలు లేకుండా దిల్లీ మెట్రోలో రూ.50లక్షల నగదు తరలిస్తున్న ఓ యువకుడిని సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం గుజరాత్‌కు చెందిన ఓ ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్‌కు చెందినదని అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఠాకూర్‌ దిలీప్‌ అనే యువకుడు చాందినీ చౌక్‌ వెళ్లేందుకు శనివారం సాయంత్రం బారఖాంబ స్టేషన్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడి బ్యాగ్‌ను సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు తనిఖీ చేయగా రూ.50లక్షల విలువ చేసే రూ.500, రూ.200, రూ100 నోట్లు బయటపడ్డాయి. ఇంత ఎక్కువ మొత్తం ఎక్కడకు తీసుకెళ్తున్నావని అధికారులు ప్రశ్నించగా, ఆ యువకుడి నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో అతడి యజమానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. నగదుతో పట్టుబడిన ఠాకూర్‌ దిలీప్‌ మేనేజర్‌ జల్పేశ్‌ కేబీ పటేల్‌ మెట్రోకు చేరుకుని ఆ నగదు మొత్తం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వ్యాపారి ధ్రువ్‌ భాయ్‌కు సంబంధించినదని పేర్కొన్నారు. ట్రాన్స్‌పోర్టు కమిషన్‌ వ్యాపారంలో భాగంగా ఈ నగదు చలామణీ జరుగుతోందని అధికారులకు వివరించారు. 

సహేతుకమైన కారణాలు, అవసరమైన పత్రాలు లేని కారణంగా ఈ కేసును సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ఆదాయపన్నుశాఖకు అప్పగించారు. పారదర్శకత కోసం రూ.2లక్షలకు పైబడిన నగదు లావాదేవీలపై 2017 నుంచి ప్రభుత్వం నిషేధించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.