Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 142513
            [news_title_telugu_html] => 

మెరుపులా బుల్లెట్‌

[news_title_telugu] => మెరుపులా బుల్లెట్‌ [news_title_english] => [news_short_description] => మంచి పికప్‌, సౌకర్యవంతమైన డిజైన్‌తోపాటు రాజసం ఉట్టిపడే టూవీలర్‌ కావాలనుకునేవారి ఎంపిక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌. 1932 నుంచి ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ బైకర్ల మనసు దోచుకుంటూనే ఉంది. [news_tags_keywords] =>  two wheeler, royal enfield, automobiles, rai rai, eenadu special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-16 01:05:56 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మెరుపులా బుల్లెట్‌ - EENADU
close

తాజా వార్తలు

మెరుపులా బుల్లెట్‌

విడుదల

మంచి పికప్‌, సౌకర్యవంతమైన డిజైన్‌తోపాటు రాజసం ఉట్టిపడే టూవీలర్‌ కావాలనుకునేవారి ఎంపిక రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌. 1932 నుంచి ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ బైకర్ల మనసు దోచుకుంటూనే ఉంది. ఈసారి బుల్లెట్‌ ఎక్స్‌, బుల్లెట్‌ ఈఎస్‌-ఎక్స్‌ అనే మోడళ్లతో మరింత మెరుగై మార్కెట్లోకి వచ్చేసింది. డిజైన్‌, ఇంజిన్‌ పవర్‌, టార్క్‌ల్లో ఎలాంటి మార్పూ లేదు. మిగతా విషయాలకొస్తే..
కొత్త పెయింట్‌ స్కీమ్‌: కలర్‌, గ్రాఫిక్‌ పూర్తిగా మారాయి. ఎక్స్‌ మోడల్‌ బ్లూ, సిల్వర్‌, బ్లాక్‌.. మూడు రంగుల్లో లభ్యమవుతోంది. ఈఎస్‌-ఎక్స్‌లో రెడ్‌, బ్లూ, బ్లాక్‌ రంగులున్నాయి. గ్లాసీ బ్లాక్‌ మెరుపులు మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇంజిన్‌ పార్ట్స్‌కి నలుపు రంగులద్దారు. రిప్ప్‌డ్‌ ప్యాటర్న్‌ సీటు పాతదే.
ఏబీఎస్‌: రెండు మోడళ్లకీ సింగిల్‌ ఛానెల్‌ యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ఏబీఎస్‌) ఫీచర్‌ జోడించారు. టెక్నికల్‌గా ఇదే చెప్పుకోదగ్గ మార్పు.
నిర్వహణ వ్యయం సగమే: కొత్త మోడళ్లతో నిర్వహణ ఛార్జీలు నలభైశాతం తగ్గుతాయంటోంది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. ప్రతి మూడు నెలలు లేదా మూడు వేల కిలోమీటర్లకోసారి ఉండే సర్వీసింగ్‌ పీరియడ్‌ని ప్రతి ఆరు నెలలు లేదా ఐదువేల కిలోమీటర్లకు సవరించారు. మినరల్‌ ఆయిల్‌ నుంచి సెమీ సింథటిక్‌ ఆయిల్‌కి ఇంజిన్‌ని మార్చారు. ఆయిల్‌ ఛేంజ్‌ గతంలో ఆరు నెలలు లేదా ఐదువేల కిలోమీటర్లు ఉండేది. దీన్ని పన్నెండు నెలలు లేదా పదివేల కిలోమీటర్లకు మార్చారు.
ధర తక్కువ: ఇన్ని అప్‌డేట్స్‌ చేసినా రెండు మోడళ్లపై ధర రూ.తొమ్మిదివేల వరకు తగ్గించడం విశేషం.
అదనపు సేవలు: ఏడాదిపాటు ఉచిత సర్వీసింగ్‌, 24X7 రోడ్‌సైడ్‌ సాయం అందిస్తున్నారు.
కొత్త మోడళ్లు మార్కెట్లోకి వచ్చినా క్లాసిక్‌ బుల్లెట్‌ మోడల్‌ని కొనసాగిస్తున్నారు.

- డీనోస్‌ వాల్ట్‌, ఆటోమొబైల్‌ బ్లాగర్‌

Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.