close

తాజా వార్తలు

గాయంతోనే ఆస్ట్రేలియాకు జడ్డూ..

గాయంతోనే ఆస్ట్రేలియాకు జడ్డూ..

మెల్‌బోర్న్‌: భారత్‌లో రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడుతున్నప్పటి నుంచే సీనియర్‌ స్పిన్నర్‌ రవీంద్ర జడేజా భుజం నొప్పితో బాధపడుతున్నాడని టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి వెల్లడించారు. ఆస్ట్రేలియాకు వచ్చిన నాలుగు రోజుల తర్వాత సూది మందు తీసుకున్నాడని వెల్లడించారు. పెర్త్‌లో రెండు టెస్టుకు 13 మందితో జట్టును ప్రకటించినప్పుడు అతడి సమస్య బయటకు రావడం ఆశ్చర్యపరిచింది. తుది జట్టులో లేకున్నా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ జడ్డూ చాలాసేపు ఫీల్డింగ్‌ చేశాడు. దీంతో గాయపడ్డ ఆటగాళ్ల విషయంలో జట్టు మేనేజ్‌మెంట్‌ ఎలా ఆలోచిస్తోందో తెలియడం లేదు.

‘భుజంలో నొప్పి ఉందని ఆస్ట్రేలియాకు వచ్చిన నాలుగు రోజులకు జడేజా సూది మందు తీసుకున్నాడు. ఉపశమనం పొందడానికి కాస్త సమయం పడుతుంది. భారత్‌లో రంజీ ఆడుతున్నప్పుడే అతడికి సమస్య ఉంది. ఆసీస్‌కు వచ్చిన తర్వాత అలాగే ఇబ్బంది పడటంతో సూది మందు ఇచ్చారు’ అని శాస్త్రి చెప్పారు. వందశాతం ఫిట్‌నెస్‌తో లేనప్పుడు పర్యటనకు ఎందుకు ఎంపిక చేశారని ఆయన సమాధానం తర్వాత సందేహాలు కలిగాయి.

‘పెర్త్‌ మ్యాచ్‌ సమయానికి 70-80 శాతం ఫిట్‌గా ఉన్నట్టు అనిపించింది. కానీ మేం రిస్క్‌ తీసుకోదలచలేదు. ఇప్పుడు 80 శాతం ఫిట్‌గా ఉంటే మెల్‌బోర్న్‌లో ఆడతాడు. ఫిట్‌నెస్‌ చాలా పెద్ద సమస్య. 24 గంటల తర్వాత దీనిపై మదింపు చేస్తాం. ఆ తర్వాత పరిస్థితులను బట్టి కార్యాచరణ ఉంటుంది. 48 గంటల తర్వాత అశ్విన్‌ పరిస్థితి అంచనావేస్తాం. రోహిత్‌ శర్మ బాగున్నాడు. మెరుగుదల కనిపించింది. సోమవారం అతడి సంగతి తెలుస్తుంది. ఇప్పటికైతే హార్దిక్‌ పాండ్య ఫిట్‌గా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఎక్కువగా ఆడలేదు. అతడు ఆడాలా వద్దా అని నిర్ణయించే ముందు మేం చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని శాస్త్రి అన్నాడు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.