close

తాజా వార్తలు

నాని ‘జెర్సీ’: అవన్నీ అబద్ధాలే!

 హైదరాబాద్‌: నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘జెర్సీ’ చిత్ర క్లైమాక్స్‌ గురించి ఇటీవల సోషల్ ‌మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలను చిత్ర బృందం ఖండించింది. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెండు క్లైమాక్స్‌లు అనుకున్నారని, వీటిల్లో ఒకటి ఖరారు చేయాల్సిందిగా, అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, నిర్మాత దిల్‌రాజులను అడిగారని వార్తలు హల్‌చల్‌ చేశాయి.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్పందించినట్లు సమాచారం. ఆ వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేసిందట. ‘జెర్సీ’ సెట్స్‌పైకి వెళ్లకముందే క్లైమాక్స్‌ ఖరారైపోయిందని, ఎలాంటి మార్పూ చేయలేదని పేర్కొందట. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. 

ఇక ఈ చిత్రానికి సంబంధించి గురువారం సాయంత్రం ‘స్పిరిట్‌ ఆఫ్‌ జెర్సీ’పేరుతో లిరికల్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అణిగిమణిగిన అలలే ఎగసెను చూడరా’ అంటూ సాగిన గీతం ఆకట్టుకుంది. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు అందించిన ఈ పాటను కాలభైరవ ఆలపించారు. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.