close

తాజా వార్తలు

సాయిధరమ్‌.. మీకు ప్రతిఫలం దక్కింది

‘చిత్రలహరి’కి మంచి స్పందన 

హైదరాబాద్‌: ‘చిత్ర లహరి’ సినిమా చక్కగా ఉందని నెటిజన్లు యూనిట్‌ సభ్యులపై ప్రశంసల జల్లు కురిపించారు. తమన్‌, హరీష్‌ శంకర్‌, మారుతీ తదితరులు సోషల్‌మీడియా వేదికగా అభినందించారు. సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌ కథానాయికలు. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ప్రముఖులతోపాటు నెటిజన్లు సాయిధరమ్‌కు వరుస ట్వీట్లు చేస్తున్నారు. సినిమా నచ్చిందని, హీరో కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని పేర్కొన్నారు. వీరందరికీ సాయిధరమ్‌ పేరు పేరునా ధన్యవాదాలు చెప్పారు.
* ‘శుభాకాంక్షలు మై డార్లింగ్‌ సోదరా.. నువ్వు ‘చిత్రలహరి’తో విజయం అందుకున్నందుకు నేను ఎంత సంతోషంగా ఉన్నానో నీకు తెలియదు’-తమన్‌
* ‘సాయిధరమ్‌ తేజ్‌, కల్యాణి ప్రియదర్శన్‌ల చక్కటి నటనతో కూడిని అద్భుతమైన భావోద్వేగపు ప్రయాణం ‘చిత్రలహరి’. ‘లహరి’గా కల్యాణి చక్కగా నటించారు. దేవిశ్రీ అద్భుతమైన నేపథ్య సంగీతం అందించారు. కెప్టెన్‌ కిషోర్‌ తిరుమల తన రచనతో ఆకట్టుకున్నారు. సూపర్’- హరీష్‌ శంకర్‌
* ‘సాయిధరమ్ తేజ్‌ తన చక్కటి నటనతో చంపేశారు. ఈ పాత్ర ఆయనలోని మరో కోణాన్ని బయటికి తీసుకొచ్చింది. కిషోర్‌ తిరుమల ఎమోషనల్‌ సీన్స్‌ చాలా బావున్నాయి. మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’- మారుతి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.