close

తాజా వార్తలు

నాపై దుష్ప్రచారం:డీజీపీకి లక్ష్మీపార్వతి ఫిర్యాదు

హైదరాబాద్‌: తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్‌ సతీమణి, వైకాపా నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను అగౌరవ పరుస్తూ విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. సదరు వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. డీజీపీని కలిసిన అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 4వ తేదీన తప్పుడు ఆరోపణలు చేస్తూ ఓ టీవీ ఛానల్‌, సోషల్‌ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కోటి కించపరిచారని ఆమె మండిపడ్డారు. అతనితో పాటు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీడియా ఛానల్‌‌, యాంకర్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు లక్ష్మీపార్వతి తెలిపారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.