close

తాజా వార్తలు

‘ఫొని’పై ప్రముఖుల ట్వీట్లు

దిల్లీ: ఒడిశాను అల్లకల్లోలం చేస్తున్న ఫొని తుపానుపై సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తూ ట్వీట్లు చేశారు. సురక్షితమైన ప్రాంతాలకు తరలివెళ్లాలని కోరుతున్నారు.

అందరూ సురక్షితంగా ఉండాలని ప్రార్ధిస్తున్నాను- విరాట్‌ కోహ్లీ 

ఫొని తుపాను బీభత్సం సృష్టిస్తున్న ప్రాంతాల్లో నివసిస్తున్నవారు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి- అభిషేక్‌ బచ్చన్‌

జాగ్రత్తగా ఉండండి. అత్యవసర ఫోన్‌ నెంబర్లు దగ్గరుంచుకోండి- రితేశ్‌ దేశ్‌ముఖ్‌

ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ్‌ బెంగాల్‌ వాసులు జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకు యత్నించండి. ఒకరికొకరు సాయం చేసుకోండి- తమన్నా

దృఢంగా, క్షేమంగా ఉండండి- సిద్ధార్థ్‌ మల్హోత్రా

ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఒకరికొకరు సాయం చేసుకుంటారని, క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను. త్వరలో ఈ తుపాను బీభత్సం నుంచి విముక్తి లభిస్తుందని కోరుకుంటున్నాను- మంచు మనోజ్‌

ఒడిశా వాసుల క్షేమం కోసం ప్రార్ధిస్తున్నాను- హర్భజన్‌ సింగ్‌

ఫొని ముంచుకొస్తోంది. జాగ్రత్తగా ఉండండి- పుజారా

ఒడిశాలో ఫొని బీభత్సం సృష్టిస్తోంది. అక్కడి వాసులు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నా. ఏ సాయం కావాలన్నా త్వరగా స్పందించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం- అఖిలేశ్‌ యాదవ్‌

ఈ తుపానును తట్టుకునే శక్తి భగవంతుడు మీకివ్వాలని కోరుకుంటున్నాను. జై జగన్నాథ్‌- వీరేందర్‌ సెహ్వాగ్‌


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.