close

తాజా వార్తలు

గొరిల్లా.. వాయిదా

టీనగర్‌: నటుడు జీవా కథానాయకుడుగా కిందటి నెలలో ‘కీ’ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘గొరిల్లా’ చిత్రం షూటింగ్‌ పనులను కూడా పూర్తిచేసుకున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం గతంలో ప్రకటించింది. కొన్ని అనివార్య కారణాలు, సమస్యలు ఈ చిత్రం విడుదలకు అడ్డుపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తాజాగా జులై 5వ తేదీకి దీనిని వాయిదా వేశారు. ఈ విషయాన్ని జీవా ట్విట్టర్‌ వేదికగా ధ్రువీకరించారు. జీవాకు జంటగా షాలిని పాండే నటిస్తున్నారు. రాధారవి, యోగిబాబు, సతీష్‌, రామదాసు, నాన్‌ కడవుల్‌ రాజేంద్రన్‌ తదితరులు ఇతర తారాగణం. చిత్రంలో ఓ చింపాంజి ముఖ్య పాత్ర పోషిస్తోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.