close

తాజా వార్తలు

సౌందర్య రజనీకాంత్‌ ఫొటోపై నెటిజన్ల గుర్రు

ట్వీట్‌ తొలగించిన సూపర్‌స్టార్ కుమార్తె

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ వివాదంలో చిక్కుకున్నారు. కొంతకాలంగా తాగడానికి గుక్కెడు నీరు లేక తమిళనాడు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో సౌందర్య తన కుమారుడు వేద్‌తో కలిసి ఈతకొలనులో దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. పిల్లలకు ఈత నేర్పడం ద్వారా వారు చాలా ఫిట్‌గా, చురుగ్గా ఉంటారని సూచించారు. అయితే ఈ ట్వీట్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఓ పక్క చెన్నైలో తాగడానికి నీరు లేక ప్రజలు అల్లాడుతుంటే.. స్విమ్మింగ్‌ చేయడానికి నీరు కావాలా? అంటూ నెటిజన్లు సౌందర్యపై మండిపడ్డారు. 

దాంతో సౌందర్య ఆ ఫొటోను తొలగించారు. ‘ప్రస్తుతం చెన్నైలో కొనసాగుతున్న నీటి కొరత సమస్యను దృష్టిలో పెట్టుకుని నేను పోస్ట్‌ చేసిన ఫొటోను తొలగిస్తున్నాను. పిల్లలకు చిన్న వయసు నుంచే వ్యాయామాలపై అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఆ ఫొటోను పోస్ట్‌ చేశాను. నీటిని కాపాడుకుందాం’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో సౌందర్య వివాహం ప్రముఖ నటుడు, వ్యాపారవేత్త విశాకన్‌ వనగమూడితో జరిగిన సంగతి తెలిసిందే. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.