
తాజా వార్తలు
సూర్య ‘బందోబస్త్’ టీజర్ చూశారా
హైదరాబాద్: తమిళ స్టార్ సూర్య నటిస్తున్న చిత్రం ‘బందోబస్త్’. ఈ సినిమా టీజర్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో సూర్య వివిధ గెటప్‌లలో కనిపించి ఆకట్టుకున్నారు. ‘వాడి చూపు, మాట, ప్రవర్తన.. ఏదీ కరెక్ట్ కాదు..’ అనే సాయేషా డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. ‘మీరు రెచ్చగొట్టింది ప్రశాంతంగా నిద్రపోతున్న పులిని. పంజా విసరడానికి ఎంతో సమయం పట్టదు..’ అని మోహన్‌లాల్ ఓ వ్యక్తిని హెచ్చరిస్తూ కనిపించారు. ఈ సినిమాలో ఆయన ప్రధాని పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ‘పోరాడటం తప్పంటే.. పోరాడే పరిస్థితి ఏర్పరచడం కూడా తప్పే కదా..’ అని సూర్య అంటే.. ‘మీరేంటి నక్సలైట్లా మాట్లాడుతున్నారు’ అని ఓ రాజకీయ నాయకుడు అనడం ఆసక్తికరంగా అనిపించింది.
మోహన్‌లాల్, ఆర్య, సాయేషా సైగల్, బొమన్ ఇరానీ, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్‌కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
