close

తాజా వార్తలు

నేను ఇచ్చిన సలహా చిరు పాటించలేదు: అమితాబ్‌

ముంబయి: ‘సైరా’ గురువుగా ఎవరు? చేయాలని అని అనుకున్నప్పుడు తమకు గుర్తొచ్చిన వ్యక్తి అమితాబ్‌ బచ్చన్‌ అని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి.’ సురేందర్‌ రెడ్డి దర్శకుడు. రామ్‌చరణ్‌ నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సైరా’ ప్రమోషన్స్‌లో చిత్రబృందం చాలా బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో చిరు ముంబయి వెళ్లగా, బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, చిరంజీవిలను నటుడు ఫర్హాన్‌ అక్తర్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.

ఈ సినిమాలో మీరు నటించడానికి గల కారణం?

అమితాబ్‌: చిరంజీవి నేనూ చాలా కాలం నుంచి మంచి స్నేహితులం. ఒక రోజు చిరు నాకు ఫోన్ చేసి ‘మా సినిమాలో నటిస్తారా’ అని అడిగారు. నాకు కథ బాగా నచ్చింది. అందుకే నేను నటించాను. ఈ సినిమాలో నా పాత్ర ఉండేది కొంత సమయమే అయినా, ఈ సినిమాలో నటించినందుకు నేను సంతోషంగా ఉన్నాను.

చిరంజీవి: మేము ఈ కథ చేయాలి అనుకున్నప్పుడు.. ‘గురువు పాత్రలో ఎవరు నటిస్తారు’ అని నేను దర్శకుడిని అడిగాను. అమితాబ్‌ బచ్చన్‌ అని సురేందర్‌ రెడ్డి చెప్పాడు. కానీ, నాకు ఎక్కడో కొంచెం అనుమానం అమితాబ్‌ ఒప్పుకొంటారో లేదోనని. ఫోన్‌ చేసి ‘సైరా’ చిత్రంలో నా గురువు పాత్రలో నటించగలరా? అని అడగగానే.. ఆయన ఒప్పుకొన్నారు. 

మీ స్నేహం ఎలా మొదలైంది?

అమితాబ్‌: చిరంజీవి నటించిన కొన్ని సినిమాలను నేను చూశాను. ఆయన గురించి చాలా చోట్ల విన్నాను. ఊటీలో ‘హమ్‌’ సినిమా షూటింగ్‌ జరుగుతున్నప్పుడు.. ఆ దగ్గర్లోనే చిరు సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అప్పుడే ఆయన్ను కలిశాను. ఆయన డ్యాన్స్‌ బాగా చేస్తారు. ఆ రోజు నుంచి మా స్నేహం మొదలైంది. నేను చిరంజీవికి చాలా సలహాలు ఇస్తాను. కానీ, అన్నీ ఆయన పాటించరు. రాజకీయాల్లోకి వెళ్లొద్దు అని చెప్పాను కానీ, ఆయన నా మాట వినలేదు.

చిరంజీవి: 1990లో నేను నటించిన మొదటి హిందీ చిత్రం ‘ప్రతిబంధ్‌’. ఈ సినిమాని అమితాబ్‌కు చూపించాలని ఆయన అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను. అలా నేను మొదటిసారి అమితాబ్‌ను కలిశాను.

‘సైరా’ మీకు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని తెలసు. దాన్ని మీరు చేయడానికి కారణం?

చిరంజీవి: స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రలో నటించాలనేది నా కల. భగత్‌సింగ్‌ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. కానీ, ఆయన కథతో నా దగ్గరకు ఎవరు రాలేదు. 12 సంవత్సరాల క్రితం నేను రాజకీయాల్లోకి వెళ్లకముందు పరుచూరి బ్రదర్స్‌ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో నా దగ్గరకు వచ్చారు. ఆ కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సమయంలో అంత బడ్జెట్‌ పెట్టే నిర్మాత మాకు దొరకలేదు. రాజకీయాల నుంచి తప్పుకొన్నాక నేను నటించిన 150వ సినిమాని చరణ్‌ నిర్మించాడు. అనంతరం ‘సైరా’ సినిమాని కూడా తానే నిర్మిస్తానని చెప్పి ముందుకు వచ్చాడు.

మీకు కూడా ఏమైనా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఉందా?

అమితాబ్‌: లేదు

కొత్తతరం నటీనటులకు మీరు ఏమైనా సలహా ఇస్తారా?

అమితాబ్‌: అప్పటికి ఇప్పటికి చాలా మారాయి. సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. అందుకే కొత్తతరం వాళ్లకు చాలా విషయాలు తెలుస్తున్నాయి.

చిరంజీవి: తరాలు మారేటప్పటికి చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. మాకంటే ఎక్కువ విషయాలు వారికే తెలుస్తున్నాయి. కొత్తతరం వారికి కొంతవరకు మాత్రమే సూచనలు ఇస్తాం.

మీరు థియేటర్‌లో చూసిన మొటది సినిమా ఏది?

అమితాబ్‌: జాగృతి

చిరంజీవి: మాయా బజార్‌

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.