close

తాజా వార్తలు

15న ‘విజయ్‌ సేతుపతి’ విడుదల

‘సంగ తమిళన్‌’లో విజయ్‌ సేతుపతి

కోడంబాక్కం, న్యూస్‌టుడే: విజయ్‌చందర్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతి హీరోగా నటించిన చిత్రం ‘విజయ్‌సేతుపతి’. ఈ సినిమాకు తెలుగులో ‘విజయ్‌ సేతుపతి’ అనే పేరు పెట్టారు. రాశీఖన్నా, నివేదా పెత్తురాజ్‌లు కథానాయికలు. విజయా ప్రొడక్షన్స్‌ బ్యానరుపై భారతిరెడ్డి దీనిని నిర్మించారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే బిగిల్‌, ఖైదీ చిత్రాలు బరిలో ఉండడం, ఆశించిన స్థాయిలో థియేటర్లు దక్కకపోవడంతో విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఇందులో విజయ్‌ సేతుపతి పోలీసు అధికారిగా నటిస్తున్నారు. పక్కా మాస్‌ కమర్షియల్‌ చిత్రంగా దీన్ని రూపొందించినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని పేర్కొన్నాయి. ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ జనాల్లో మరింత క్రేజీ సంపాదించుకోవాలని విజయ్‌ సేతుపతి భావిస్తున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.