close

తాజా వార్తలు

అప్పు తీర్చలేదని.. అబలపై అమానుషం!

పంజాబ్‌: తన వద్ద తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని.. పంజాబ్‌లో ఓ కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ సోదరుడు ఓ మహిళపై అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. ముక్త్‌సర్‌లో శుక్రవారం ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానిక కౌన్సిలర్‌ రాకేష్‌ చౌధరీ సోదరుడు సురేష్‌ ఓ మహిళకు గతంలో రూ. 23 వేలు అప్పు ఇచ్చాడు. ఆ బాకీ కట్టలేదన్న కోపంతో దాష్టీకానికి పాల్పడ్డాడు. తన అనుచరులతో వచ్చి నిస్సహాయురాలైన ఆ మహిళను ఇంట్లో నుంచి నడిరోడ్డుపైకి ఈడ్చుకెళ్లాడు. బెల్టుతో విచక్షణ రహితంగా కొట్టాడు. మిగిలినవారు కర్రలతో ఆమెను ఇష్టమొచ్చినట్లు కొట్టారు. స్పృహ కోల్పోయే వరకు ఆమెపై దాడి చేశారు. ఈ దారుణాన్ని ఆపేందుకు ప్రయత్నించిన మరో మహిళను కూడా కొట్టారు. తీవ్ర గాయాలపాలైన బాధిత మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సురేష్‌ సహా ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ ఘటనను పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.