close

తాజా వార్తలు

ఐసిస్‌కు చెందిన ముగ్గురి అరెస్టు

చెన్నై: ఐసిస్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురిని తమిళనాడు కోయంబత్తూరులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మహ్మద్‌ హుస్సేన్‌, షాజహాన్‌, షేక్‌ సఫిల్లాపై పోతనూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.  వీరిని స్థానిక కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం ఈ నెల 28 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. వీరంతా కోయంబత్తూరులో ఉగ్రదాడులకు కుట్ర పన్నుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిఘా అధికారులు, ప్రార్థనా మందిరాలే లక్ష్యంగా దాడులకు కుట్ర పన్నినట్లు  భావిస్తున్నారు.  ఐసిస్‌ భావజాలానికి ఆకర్షితులైన ఈ ముగ్గురూ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే వీడియోలు చూస్తున్నారని, అంతేకాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే కొన్ని పత్రాలను తమిళంలోకి అనువదించి స్థానికులను ఉగ్రవాదం వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. గత ఏప్రిల్‌ 21న శ్రీలంకలో జరిగిన బాంబుదాడిలో పాల్గొన్న వారితో ఈ ముగ్గురికీ సంబంధాలుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.