close

తాజా వార్తలు

రిఫ్రిజిరేటర్‌ పేలి ముగ్గురి మృతి..

చెన్నై: తమిళనాడులోని సెలైయ్యూరులో ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ న్యూస్‌ ఛానెల్‌లో రిపోర్టర్‌గా పనిచేసే ప్రసన్న (39), ఆయన భార్య అర్చన (32)తో పాటు ఆయన తల్లి రేవతి (59) ఈ ప్రమాదంలో మృతి చెందారు. వారు సెలైయ్యూరులోని తిరుమంగై మన్నన్‌ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. షాట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఫ్రిజ్‌లోంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రసన్న దానిపై నీళ్లు పోయడానికి ప్రయత్నించాడని, అయితే, అందులోంచి విషపూరిత గ్యాస్‌ వెలువడినట్లు తెలుస్తోంది.  

ఆ ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకపోవడంతో చుట్టుపక్క గదుల్లో ఉన్న వ్యక్తులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూడగా వారి ముగ్గురి మృతదేహాలు కనపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.