close

తాజా వార్తలు

2 నెలల చిన్నారి అపహరణ.. విక్రయం

నిందితుల అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం): రెండు నెలల చిన్నారిని అపహరించి, విక్రయించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన వివరాలను శుక్రవారం ఎస్పీ రెమారాజేశ్వరి వెల్లడించారు. పట్టణంలోని వల్లభ్‌నగర్‌లో ఈ నెల 13న అర్ధరాత్రి పొట్టోళ్ల చిట్టి అలియాస్‌ హద్దులమ్మ, యాదయ్య దంపతుల 2 నెలల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు బురఖాలు ధరించి వచ్చి అపహరించుకు వెళ్లారు. తల్లి హద్దులమ్మ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆటోలో పారిపోయారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని వీరన్నపేట ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సలీం, అతని భార్య సమీనా నహీద్‌, మరో మహిళ తస్లీమ్‌.. దొడ్డలోనిపల్లిలో రోజూ కల్లు తాగేందుకు వెళ్లేవారు. హద్దులమ్మ, యాదయ్య దంపతులు కూడా.. అక్కడికి కల్లు తాగేందుకు వెళ్లేవాళ్లు. హద్దులమ్మకు నలుగురు ఆడపిల్లలు ఉండడాన్ని గమనించిన సలీం దంపతులు, తస్లీమ్‌..చిన్నారిని తమకు ఇవ్వాలని అడిగారు. వారు నిరాకరించడంతో.. 13 రాత్రి ఆ ముగ్గురు వచ్చి చిన్నారిని అపహరించుకుపోయారు. వీరన్నపేటకు చెందిన ఖతిజాబేగంకు రూ.పది వేలకు చిన్నారిని విక్రయించారు. అప్పటి వరకు పిల్లలు లేని ఆ ఇంట్లో 2 నెలల పాప ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఖతిజాబేగంను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చిన్నారిని విక్రయించిన వారినీ అరెస్టు చేశారు. ఆ బాలిక హద్దులమ్మ, యాదయ్య దంపతుల కుమార్తె అని నిందితులు చెప్పడంతో.. చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.