close

తాజా వార్తలు

ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా దీదీ భారీ ర్యాలీ

కోల్‌కతా: అసోంలో జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ)ని చేపట్టడాన్ని నిరసిస్తూ తృణమూల్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ర్యాలీ కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి 5 కిలోమీటర్ల పాటు సాగే ర్యాలీని ఉత్తర కోల్‌కతాలోని సింథీ ప్రాంతం నుంచి ప్రారంభించారు. పాదయాత్రగా చేపట్టిన ఈ ర్యాలీకి భారీగా ప్రజలు తరలివచ్చారు. 

ఎన్‌ఆర్‌సీని తృణమూల్‌ కాంగ్రెస్‌ మొదటి నుంచి విమర్శిస్తోంది. దీన్ని ఉపయోగించుకుని ప్రజలను విభజించాలని భాజపా చూస్తోందని ఆరోపిస్తోంది. ఈ జాబితాను వ్యతిరేకిస్తూ ఈ నెల 7, 8 తేదీల్లో సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆ పార్టీ ర్యాలీలు నిర్వహించింది. ఆగస్టు 31న అసోంలో ప్రకటించిన పౌర జాబితాలో 19 లక్షల మందికి చోటు దక్కని సంగతి తెలిసిందే.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.