close

తాజా వార్తలు

కెరియర్‌ డిజైన్‌కు కొన్ని కోర్సులు

అగ్గిపెట్టెలు అలాగే ఎలా ఉంటాయి? సబ్బుబిళ్లలకు అంత సొగసెందుకు? కంపెనీకో తీరుగా కార్లు ఉండటానికి కారణం ఏమిటి? అన్నింటికీ సమాధానం ఒక్కటే. అవన్నీ వినియోగదారుడిని ఆకట్టుకోవడానికి మార్కెట్‌ చేసే మాయలు. వాటి వెనుక ఎందరో నిపుణులు ఉంటారు. ఏ వస్తువు ఏ ఆకారంలో ఉండాలో డిసైడ్‌ చేస్తారు. శాస్త్రీయంగా డిజైన్‌ చేస్తారు.  ఇలా వస్తుప్రేమతో సృజనాత్మకంగా కెరియర్‌ సాగించాలనుకుంటే కొన్ని కోర్సులు చేయాలి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి.

మార్కెట్‌లో ప్రతి వస్తువుకు ఒక ఆకారం ఉంటుంది. దాన్ని ఆ రూపంలో తీర్చిదిద్దడానికి నిపుణులు  కృషి చేస్తుంటారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాటిని రూపొందిస్తుంటారు. ఆ విధంగా డిజైనింగ్‌ పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థుల కోసం కొన్ని కోర్సులు ఉన్నాయి. ఇంటర్మీడియట్‌ అర్హతతో వాటిలో చేరవచ్చు. దేశవ్యాప్తంగా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్లు డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ స్థాయుల్లో ఈ కోర్సులను అందిస్తున్నాయి.

ఇంటర్‌ తర్వాత యూసీడ్‌
ఇంటర్మీడియట్‌ తర్వాత డిజైన్‌ కోర్సుల్లో చేరాలంటే యూసీడ్‌  (అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌)కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో మెరిట్‌ సాధిస్తే ఐఐటీ-బాంబే, గువాహటితోపాటు పేరున్న సంస్థలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిస్‌) కోర్సులోకి ప్రవేశం లభిస్తుంది. 2019లో ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌ ఇలా.. ఏ బ్రాంచి విద్యార్థులైనా అర్హులే. మూడేళ్ల డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సులు చదివిన విద్యార్థులూ అప్లై చేయవచ్చు. 2018, అంతకంటే ముందు కోర్సులు పూర్తిచేసినవారు అనర్హులు. (ఐఐటీ-గువాహటిలో ప్రవేశానికి ఇంటర్‌ ఎంపీసీ తప్పనిసరి).  రెండు వరుస ప్రయత్నాల్లో మాత్రమే యూసీడ్‌ రాయడానికి అవకాశం ఉంటుంది.

వయసు: అక్టోబరు 1, 1995 తర్వాత జన్మించినవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే అక్టోబరు 1, 1990 తర్వాత జన్మించినప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలో 300 మార్కులకు ఉంటుంది. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్‌-ఎలో మొత్తం 240 మార్కులు. వ్యవధి రెండున్నర గంటలు. 3 సెక్షన్లు ఉంటాయి. పార్ట్‌-బికి 60 మార్కులు. వ్యవధి 30 నిమిషాలు. ఒక ప్రశ్న ఇస్తారు. అభ్యర్థి డ్రాయింగ్‌ నైపుణ్యాలను పరిశీలిస్తారు.

ప్రవేశం కల్పించే సంస్థలు, సీట్లు: ఐఐటీ-బాంబే, గువాహటి, హైదరాబాద్‌, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, డిజైన్‌ అండ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ - జబల్‌పూర్‌.. ఈ నాలుగు సంస్థల్లో మొత్తం 144 సీట్లు ఉన్నాయి.

ఐఐటీ-బాంబేలో చేరినవారు బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ అనంతరం మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సు చేసుకోవచ్చు. డిగ్రీ మూడో సంవత్సరంలో ఐచ్ఛికాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇలా చేరినవారికి బీడిస్‌ + ఎండిస్‌ డ్యూయల్‌ డిగ్రీ అయిదేళ్లలో పూర్తవుతుంది. యూసీడ్‌ స్కోర్‌ను దేశవ్యాప్తంగా పలు ఇతర సంస్థలూ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వాటిలో ముఖ్యమైనవి యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, విట్‌, లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, చండీగఢ్‌ యూనివర్సిటీ, మిట్‌, యూపీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌.

(డిజైన్‌ల్లో పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌) ప్రకటన వివరాలు, పరీక్షా విధానం తదితరాల కోసం www.eenadupratibha.net చూడవచ్చు)

ముఖ్యమైన తేదీలు (యూసీడ్‌, సీడ్‌)

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
చివరి తేదీ: నవంబరు 9.
రూ.500 ఆలస్య రుసుంతో: నవంబరు 16 పరీక్ష: జనవరి 18.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌,
విశాఖపట్నం వెబ్‌సైట్లు: www.uceed.iitb.ac.in/2020, www.ceed.iitb.ac.in/2020


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.