close

తాజా వార్తలు

మోదీ సోదరుడి కుమార్తెపై దొంగల బీభత్సం

పోలీసులకు ఫిర్యాదు చేసిన దమయంతి బెన్‌ మోదీ

దిల్లీ: దేశ రాజధానిలో జరుగుతున్న చైన్‌ స్నాచింగ్‌ ఘటనలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ద్విచక్ర వాహనంపై వస్తున్న ముసుగు దొంగలు మహిళలు, యువతులు లక్ష్యంగా చోరీలకు పాల్పడి క్షణాల్లో పరారవుతున్నారు. తాజాగా ఈ రకమైన దోపిడీకి ప్రధాని మోదీ సొంత సోదరుడి కుమార్తె అయిన దమయంతి బెన్‌ మోదీ కూడా బాధితురాలు కావడం చర్చనీయాంశమైంది. గుర్తు తెలియని ఇద్దరు ముసుగు దొంగలు ద్విచక్రవాహనంపై వచ్చి తన వ్యాలెట్‌ లాక్కెళ్లిపోయారని ఆమె శనివారం సివిల్‌ లైన్స్‌లోని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. శనివారం ఉదయం దమయంతి బెన్‌ మోదీ అమృత్‌సర్‌ నుంచి దిల్లీకి వచ్చారు. బస కోసం సివిల్‌ లైన్స్ ప్రాంతంలోని గుజరాతీ సమాజ్‌ భవన్‌లో గది బుక్‌ చేసుకున్నారు. గేటు వద్దకు వచ్చేసరికి ఇద్దరు ముసుగు దొంగలు బైక్‌పై వచ్చి తన హ్యాండ్‌ బ్యాగును లాక్కెళ్లారు. అందులో రూ.56 వేల నగదు, రెండు సెల్‌ ఫోన్లు, ముఖ్యమైన పత్రాలు ఉన్నాయని దమయంతి మోదీ వివరించారు. శనివారం సాయంత్రం విమానం ఎక్కాల్సి ఉందని, కానీ ముఖ్యమైన పత్రాలన్నీ ఆ సంచిలోనే ఉండిపోయాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
దిల్లీ పోలీసులు ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టిసారించి విచారణ జరుపుతున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ నివాసానికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఈ చోరీ జరగడం గమనార్హం.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్
HITS2020
Saket Pranamam
VITEEE 2020

Panch Pataka

దేవతార్చన