
తాజా వార్తలు
నెటిజన్‌కు నటి కౌంటర్
ముంబయి: తనను సోషల్‌మీడియాలో విమర్శించిన నెటిజన్‌కు కథానాయిక తాప్సి దీటుగా సమాధానం ఇచ్చారు. ఆమె బాలీవుడ్ చరిత్రలోనే ప్రాబ్లమాటిక్ నటని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. ‘బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత సమస్యాత్మకమైన నటి తాప్సి. ఇది ఆమెకు తెలుసా, లేదా.. అనే విషయం నాకు తెలియదు’ అని విమర్శించారు. దీన్ని చూసిన తాప్సి అతడికి ఘాటుగా రిప్లై ఇచ్చారు. ‘నాకు ఆ విషయం తెలుసు 😁 . నేను చాలా ప్రాబ్లమాటిక్ అని నా తల్లిదండ్రుల నమ్మకం కూడా. అంతేకాదు విమర్శించేవారికి, షరతులు పెట్టేవారికి నేనెప్పుడూ పెద్ద సమస్యగానే కనిపిస్తా. సారీ.. ఇకపై కూడా నేను ఇలానే ఉంటా. కాబట్టి నన్ను విమర్శించేందుకు నీకు మరింత బలం చేకూరాలని కోరుకుంటున్నా 💁🏻♀️ 😜 ’ అని తాప్సి ట్వీట్ చేశారు.
టాలీవుడ్లో కెరీర్ ఆరంభించిన తాప్సి ప్రస్తుతం బాలీవుడ్లో నటిగా దూసుకుపోతున్నారు. ‘పింక్’ సినిమా నుంచి అక్కడ బిజీ అయ్యారు. ‘రన్నింగ్ షాది’, ‘నామ్ షబానా’, ‘జుడ్వా 2’, ‘ముల్క్’, ‘బద్లా’ తదితర చిత్రాలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అక్టోబరు 25న తాప్సి నటించిన ‘శాండ్ కీ ఆంఖ్’ విడుదలై, విజయం సాధించింది.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
