
తాజా వార్తలు
లాస్ ఏంజిలెస్ : ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానంలో మంటలు రావడం కలకలం రేపింది. మనీలాకు బయలుదేరేందుకు గురువారం లాస్ ఏంజిల్స్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అత్యవసరంగా విమానాన్ని కిందకు దించారు. అందులో ప్రయాణిస్తున్న 347మంది ప్రయాణికులు, 18మంది సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు ఎయిర్‌లైన్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రమాదానికి గురైన 113 విమానం బోయింగ్ కో-777 రకానికి చెందినదని ఆయన పేర్కొన్నారు. విమానంలోని పైలట్ ఎమెర్జన్సీ ప్రకటించి, ఇంజిన్ విఫలమైనట్లు పేర్కొన్నారని లాస్ ఏంజిల్స్ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదం గురించి ప్రత్యక్షంగా చూసిన కొద్ది మంది మీడియాతో మాట్లాడుతూ గాల్లో ఉండగానే విమానంలో మంటలు చెలరేగినట్లు కనిపించాయని చెప్పారు. దీనిపై యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ స్పందిస్తూ.. ఎలాంటి నష్టం జరగక ముందే విమానం ల్యాండ్ అయిందని పేర్కొంది. మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో విమానం రన్ వేపైకి చేరుకుందని లాస్ ఏంజిల్స్ అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రమాద ప్రభావం ఇతర విమానాలపై పడకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. స్థానిక ఏబీసీ-7 టెలివిజన్‌లో విమానం గాల్లో ఉండగా మంటలు చెలరేగిన దృశ్యాలు ప్రసారమయ్యాయి.
ఇటీవలే బోయింగ్ 737 మ్యాక్స్ సింగిల్ ఐస్లే జెట్ లైనర్‌లో సమస్యలు వస్తున్నట్లు వరుసగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ రకం విమాన సేవల్ని నిలిపివేశారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
- ‘కబీర్‌సింగ్’ సీన్లుఇబ్బంది పెట్టాయని తెలుసు!
- నా జీవితంలో గొప్ప విషయమిదే: రాహుల్ సిప్లిగంజ్
- రూ.3.5 కోట్లు ఫ్రిడ్జ్‌లో పెట్టి..!
- గ్లూటెన్ ఉంటే ఏంటి?
- బాలయ్య సినిమాలో విలన్‌గా శ్రీకాంత్..?
- ఈగల్ 2.0 రోబో టీచరమ్మ!
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
