close

తాజా వార్తలు

రివ్యూ: నమస్తే ఇంగ్లాండ్‌

రివ్యూ: నమస్తే ఇంగ్లాండ్‌

సినిమా పేరు: నమస్తే ఇంగ్లాండ్‌ (హిందీ)

నటీనటులు: అర్జున్‌ కపూర్‌, పరిణీతి చోప్రా, ఆదిత్య సీల్‌, అక్షయ్‌ కుమార్‌, అనిల్‌ మాంగే తదితరులు
సంగీతం: బాద్‌షా, మన్నన్‌ షా, రిషీ రిచ్
కూర్పు: అమితాబ్ శుక్లా
నిర్మాణ సంస్థ: పెన్‌ ఇండియా లిమిటెడ్‌, నమస్తే ప్రొడక్షన్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, బ్లాక్‌బస్టర్‌ మూవీ ఎంటర్‌టైనర్స్‌
కథ: సురేశ్‌ నాయర్‌, రితేశ్‌ షా
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విపుల్‌ అమృత్‌లాల్‌ షా
విడుదల తేదీ: 18-10-2018

ర్జున్‌ కపూర్‌, పరిణీతి చోప్రాలకు బెస్ట్‌ ఆన్ ‌స్క్రీన్‌ జోడీగా పేరుంది. ‘ఇషక్‌ జాదే’ చిత్రంతో ఇద్దరూ బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే మంచి విజయం అందుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో చిత్రం ‘నమస్తే ఇంగ్లాండ్‌’. బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘నమస్తే లండన్’కు కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమిది. ఇందులో అక్షయ్‌ అతిథి పాత్రలో కన్పిస్తారు. మరి తొలి చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది?

కథేంటంటే: జస్మీత్‌(పరిణీతి), పరమ్‌(అర్జున్‌ కపూర్‌) భార్యాభర్తలు. వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతుంటారు. అయితే జస్మీత్‌కు జీవితానికి సంబంధించి కొన్ని కలలుంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి వైవాహిక బంధంలో స్వేచ్ఛ లేదనే బాధతో ఉంటుంది. ఓరోజు ఆ విషయం పరమ్‌కు చెప్పి ఇంగ్లాండ్‌కు వెళ్లిపోతుంది. అయినా భార్యను మర్చిపోలేక ఆమెను వెతుక్కుంటూ ఇంగ్లాండ్‌కు బయలుదేరుతాడు పరమ్‌. అక్కడికి చేరుకున్నాక జస్మీత్‌ గురించి ఏం తెలిసింది? ఇంతకీ ఆమె నెరవేర్చుకోవాలనుకున్న కలలేంటి? అవి తీరాయా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ: నమస్తే ఇంగ్లాండ్‌

ఎలా ఉందంటే: ఇలాంటి ప్రేమకథా చిత్రాలను గతంలో చూసే ఉంటాం. ఆడపిల్లలను ఇంటిపట్టునే ఉంచాలనుకునే కుటుంబం... ఇవన్నీ పట్టించుకోకుండా తన కలలను సాకారం చేసుకోవాలనుకునే అమ్మాయి.. ఆమెని పెళ్లి చేసుకోవడానికి విదేశాలను నుంచి వచ్చే అబ్బాయి.. ఈ కాన్సెప్ట్‌తో గతంలో సినిమాలు వచ్చాయి. కాబట్టి కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదనిపిస్తుంది. అర్జున్‌, పరిణీతి మధ్య వచ్చే సంభాషణల్లో లాజిక్‌ ఉండదు. పైగా చాలా సార్లు విన్నట్లుగానే అనిపిస్తాయి. పాటలు కూడా అంతగా ఆకట్టుకోవు. సందర్భానికి తగ్గట్టుగా లేవు. ద్వితీయార్ధం మోలో డ్రామాతో సాగిపోతుంది. నిర్మాణ సంస్థలకు తగ్గట్టు నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.

ఎవరెలా చేశారంటే: అర్జున్‌ కపూర్‌ నటించిన గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో అంతగా ఆకట్టుకోడు. స్క్రిప్ట్‌ అర్థంకానట్టుగా డైలాగులు మింగేశాడేమో అనిపిస్తుంది. దర్శకుడు అతడి ప్రతిభను సరిగ్గా ఉపయోగించుకోవాల్సింది. పరిణీతి చోప్రాకు బాలీవుడ్‌ బబ్లీ గర్ల్‌ అనే గుర్తింపు ఉంది. కానీ, ఆ తళుకులు ఈ సినిమాలో కన్పించలేదు. అక్షయ్‌కుమార్ అతిథి పాత్రలో మెరుస్తారు కానీ ఆయన డైలాగులు కూడా పెద్దగా ఆకట్టుకోవు. యువత సరదాగా సినిమాకు వెళ్లడానికి బాగుంటుందే తప్ప ఈ చిత్రం నుంచి అంతకంటే ఎక్కువ ఆశించలేం.

రివ్యూ: నమస్తే ఇంగ్లాండ్‌

బలాలు
+ నిర్మాణ విలువలు

బలహీనతలు
- కథ, కథనం
- ద్వితీయార్ధంలో మెలోడ్రామా
- పాటలు
- లాజిక్‌ లేని సంభాషణలు

చివరగా: ‘నమస్తే ఇంగ్లాండ్‌’..రొటీన్‌ లవ్‌స్టోరీ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.