Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 81684
            [news_title_telugu_html] => 

సచిన్‌, కుంబ్లే, ద్రవిడ్‌ల పోరాటం వల్లే అది సాధ్యమైంది

[news_title_telugu] => సచిన్‌, కుంబ్లే, ద్రవిడ్‌ల పోరాటం వల్లే అది సాధ్యమైంది [news_title_english] => Sehwag says sachin kumble dravid faught for bcci revenue for players financial security [news_short_description] => ఆటగాళ్ల ఆర్ధిక భద్రత కోసం సచిన్‌ తెందుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌కుంబ్లే బీసీసీఐతో పోరాడారని.. అందుకు ప్రస్తుత ఆటగాళ్లు వారికి కృతజ్ఞత చూపాలని వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నారు... [news_tags_keywords] => Cricket,Sports ,Sehwag,BCCI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-04-10 23:51:02 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సచిన్‌, కుంబ్లే, ద్రవిడ్‌ల పోరాటం వల్లే అది సాధ్యమైంది - Sehwag says sachin kumble dravid faught for bcci revenue for players financial security - EENADU
close

తాజా వార్తలు

సచిన్‌, కుంబ్లే, ద్రవిడ్‌ల పోరాటం వల్లే అది సాధ్యమైంది

ప్రస్తుత ఆటగాళ్ల ఆదాయంపై సెహ్వాగ్‌ 

దిల్లీ: ఆటగాళ్ల ఆర్ధిక భద్రత కోసం సచిన్‌ తెందుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌కుంబ్లే బీసీసీఐతో పోరాడారని.. అందుకు ప్రస్తుత ఆటగాళ్లు వారికి కృతజ్ఞత చూపాలని వీరేందర్‌ సెహ్వాగ్‌ అన్నారు. 2001-2002లో బీసీసీఐతో ఆ ముగ్గురూ పోరాడారని గుర్తుచేసుకున్నాడు. ‘సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌, కుంబ్లే ఈ నాలుగురూ ప్లేయర్స్‌ అసోసియేషన్‌ నెలకొల్పి బోర్డుపై తిరుగుబాటు చేశారు. ఆదాయంలో ఆటగాళ్ల వాటా అడిగారు. అందుకోసం పోరాడాల్సి వచ్చింది. కానీ మరే ఇతర క్రీడల్లో ఇలాంటివి లేవు. అయినా వాళ్లు పోరాడారు. ఒకవేళ వాళ్లు అలా చేసుండకపోతే ఈ రోజు మేమీ స్థాయిలో ఉండేవాళ్లం కాదు’ అని సెహ్వాగ్‌ చెప్పాడు.

ఇండో ఇంటర్నేషనల్‌ ప్రీమియర్‌ కబడ్డీ లీగ్‌ (ఐపీకేఎల్‌) నిర్వాహకులు 20 శాతం ఆదాయాన్ని ఆటగాళ్లకు ఇచ్చేందుకు ముందుకు రావడంతో సెహ్వాగ్‌ పై వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఒకవేళ ఐపీకేఎల్‌ నిర్వాహకులు 20 శాతం ఆదాయాన్ని ఆటగాళ్లకి ఇస్తే చాలా మంచిదని, అది చూసి ఇతర క్రీడల్లోనూ మార్పు వస్తుందని అన్నారు. అలాగే తాను భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌ని ఓసారి కలిసినప్పుడు తనతో మాట్లాడాడడని చెప్పారు. సర్దార్‌కి మ్యాచ్‌ ఆడే రోజుల్లో అతితక్కువ టీఏ/డీఏ  ఇచ్చేవారని, అందులో మ్యాచ్‌ ఫీజు కూడా ఇచ్చేవారు కాదని  చెప్పినట్లు సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

కాగా ఇదివరకే నేషనల్‌ ఫెడరేషన్‌.. ప్రో కబడ్డీని నడిపిస్తుండగా మరో కబడ్డీ లీగ్‌ రావడంలో తప్పులేదని అన్నాడు. రెండూ ఉంటే భారత ఆటగాళ్లకు ఎంతో ఉపయోగపడుతుందన్నాడు. దీన్ని క్రికెట్‌తో పోల్చి చూడొద్దని, బీసీసీఐ ఆదాయం చాలా ఎక్కువని చెప్పాడు. ఇప్పటికే క్రికెట్‌లో చాలా టోర్నమెంట్లు ఉన్నాయని, ఇక మిగతా లీగ్‌లు అవసరం లేదని స్పష్టంచేశాడు. అయితే ఇటీవల మన కబడ్డీ జట్టు ఆసియా క్రీడల్లో ఇరాన్‌ చేతిలో ఓడిపోయిందని, అది తననెంతో బాధించిందని అన్నాడు. కబడ్డీ ఆటగాళ్లు రెండు లీగులు ఆడితే మరింత మంది కొత్త ఆటగాళ్లు వస్తారని అది కబడ్డీ ఆటకు ఎంతో ఉపయోగకరమని వివరించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.