close

తాజా వార్తలు

దిల్లీ విజయానికి 30 బంతుల్లో 51 పరుగులు

విశాఖ: హైదరాబాద్‌, దిల్లీ మధ్య జరుగుతున్న ఎలిమినేటర్‌ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. హైదరాబాద్‌ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యఛేదనలో 15 ఓవర్లు ముగిసే సరికి దిల్లీ 111/5 పరుగులు చేసింది. రిషభ్ పంత్‌ (12; 8 బంతుల్లో 1×6) నిలకడగా ఆడుతున్నాడు. రూథర్‌ఫర్డ్‌ క్రీజులోకి వచ్చాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన 15వ ఓవర్‌ తొలి బంతికి కొలిన్‌ మన్రో (14; 13 బంతుల్లో 1×4, 1×6), నాలుగో బంతికి అక్షర్‌పటేల్‌ (0; 3 బంతుల్లో) ఔటయ్యారు. ఈ ఓవర్‌లో పరుగులేమీ రాకుండా రెండు వికెట్లు పడ్డాయి. అర్ధశతకం సాధించిన పృథ్వీషా (56; 38 బంతుల్లో 6×4, 2×6)ను ఖలీల్‌ అహ్మద్‌ 10.6వ బంతికి పెవిలియన్‌ పంపించాడు. దిల్లీ విజయానికి 30 బంతుల్లో 51 పరుగులు కావాలి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.