Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 96959
            [news_title_telugu_html] => 

కుంబ్లే జట్టులో నో కోహ్లీ.. నో రోహిత్‌

[news_title_telugu] => కుంబ్లే జట్టులో నో కోహ్లీ.. నో రోహిత్‌ [news_title_english] => Anil Kumble picks his best XI for the season big name misses out [news_short_description] => ఐపీఎల్‌ ఫైనల్‌కు ముందు భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే తన 2019లో ఉత్తమ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. ధోనీ కెప్టెన్‌గా ప్రకటించిన కుంబ్లే జట్టులో రాయల్‌ ఛాలెంజర్స్‌....... [news_tags_keywords] => anil kumble,IPL,Kohli [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-11 16:22:27 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కుంబ్లే జట్టులో నో కోహ్లీ.. నో రోహిత్‌ - Anil Kumble picks his best XI for the season big name misses out - EENADU
close

తాజా వార్తలు

కుంబ్లే జట్టులో నో కోహ్లీ.. నో రోహిత్‌

దిల్లీ : ఐపీఎల్‌ ఫైనల్‌ పోరుకు ముందు భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే తన 2019 ఉత్తమ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. ధోనీని కెప్టెన్‌గా ప్రకటించిన ఆ జట్టులో రాయల్‌ ఛాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో పాటు ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మకు చోటు కల్పించలేదు. బెంగళూరు బౌలర్‌ చాహల్‌కు అవకాశం ఇవ్వని కుంబ్లే.. ఆశ్చర్యకరంగా రాజస్థాన్‌ రాయల్స్‌ లెగ్‌ స్పిన్నర్‌ శ్రేయస్‌ గోపాల్‌కు చోటు కల్పించాడు. దిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు కూడా ఈ జట్టులో చోటు లభించింది. ధోనీ, రాహుల్, పాండ్య, బుమ్రా మినహా భారత జట్టు ఆటగాళ్లలో మరెవరికీ అవకాశం ఇవ్వలేదు. తన జట్టులో ఆటగాళ్ల ఎంపికపై కుంబ్లే వివరణ ఇచ్చాడు.

‘శ్రేయస్‌ అయ్యర్‌ను ఎందుకు తీసుకున్నానంటే.. అతను సత్తా ఉన్న ఆటగాడు. ఇప్పటికే ఐపీఎల్‌లో రాణించాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ బాధ్యత తీసుకొని బ్యాటింగ్‌ చేస్తాడు. దిల్లీ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించదు. అయినా, శ్రేయస్‌ బ్యాటింగ్‌ చేసి చూపించాడు. 16 మ్యాచుల్లో  463 పరుగులు చేశాడు’ అని కుంబ్లే తెలిపాడు. సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ను తీకున్నప్పటికీ మరో ఓపెనర్‌ బెయిర్‌స్టోకు అవకాశం ఇవ్వలేదు. అతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌కు అవకాశం ఇచ్చాడు. ‘వార్నర్‌, బెయిర్‌ స్టో ఇద్దరూ ప్రమాదకరమైన బ్యాట్స్‌మెన్‌. నేను కూడా బెయిర్‌స్టోను తీసుకోవాలని అనుకున్నా. కానీ, జట్టు సమతూకం కోసం రాహుల్‌ను ఎంచుకున్నాను’ అని తెలిపాడు. మిడిల్‌ ఆర్డర్‌లో హార్దిక్‌ పాండ్య, రసెల్‌కు కచ్చితంగా చోటు కల్పించాల్సిందే. ఎందుకంటే.. ఈ సీజన్‌లో టీ20 క్రికెట్‌కు అర్థం చెప్పింది వాళ్లిద్దరే అన్నాడు. అయితే, శ్రేయస్‌ గోపాల్‌ ఎంపిక గురించి మాత్రం వివరణ ఇవ్వలేదు.
కుంబ్లే ప్రకటించిన 2019 ఐపీఎల్‌ జట్టు..
ధోనీ(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), డేవిడ్‌ వార్నర్‌, కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌పంత్‌, హార్దిక్‌ పాండ్య, అండ్రూ రసెల్‌, శ్రేయస్‌ గోపాల్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, కగిసో రబాడా, జస్ప్రీత్‌ బుమ్రా.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.