close

తాజా వార్తలు

2026 వింటర్‌ ఒలింపిక్స్‌ వేదిక ఖరారు

ఇటలీ: 2026లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌కు ఇటలీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు వింటర్‌ ఒలింపిక్స్‌, మార్చి 6 నుంచి 15 వరకు వింటర్‌ పారాలింపిక్స్ జరగనున్నాయి. ఇటలీలోని మిలానో, కార్టినా నగరాల్లో వీటిని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ(ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ ఆటల అతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్‌ బిడ్‌ దాఖలు చేయగా, ఎక్కువ మంది ఐఓసీ సభ్యులు ఇటలీకే ఓటేశారు. ఇప్పటివరకు ఇటలీ రెండుసార్లు 1956, 2006లో వింటర్‌ ఒలింపిక్స్‌ను నిర్వహించింది.  
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.