close

తాజా వార్తలు

విజయాల జాబితాలో రెండో స్థానం..

లీడ్స్: ప్రపంచకప్‌లో ఎక్కువ విజయాలు అందుకున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. శనివారం లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్‌ విజయం సాధించి ఈ ఘనత సాధించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (103), కేఎల్‌ రాహుల్‌ (111) శతకాలతో రాణించగా టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. హిట్‌మ్యాన్‌ ఈ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో 647 పరుగులు సాధించి పరుగుల వీరుల్లో అగ్రస్థానంలో నిలిచాడు.  ఈ గెలుపుతో టీమిండియా ప్రపంచకప్‌లో 53 విజయాలను నమోదుచేసుకుంది. న్యూజిలాండ్‌ కూడా 53 విజయాలతో భారత్‌తో సమానంగా ఉంది. కానీ కివీస్‌ 87 మ్యాచ్‌లు ఆడగా , భారత్‌ 83 మ్యాచ్‌ల్లోనే 53 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా 69 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 
సెమీస్‌కు భారత్‌, ఆసీస్, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ అర్హత సాధించిన విషయం తెలిసిందే. సెమీఫైనల్‌-1లో మాంచెస్టర్‌ వేదికగా మంగళవారం న్యూజిలాండ్‌తో భారత్‌ తలపడనుంది. సెమీఫైనల్‌-2లో బర్మింగ్‌హామ్‌ వేదికగా గురువారం ఆసీస్‌×ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ జరగనుంది. 

ప్రపంచకప్‌లో అత్యధిక విజయాలు అందుకున్న టాప్-10 దేశాలు:
1. ఆస్ట్రేలియా - 69
2. భారత్‌ - 53
3. న్యూజిలాండ్ - 53
4. ఇంగ్లాండ్‌ - 47
5. పాకిస్థాన్ -  45
6. వెస్టిండీస్ - 43
7. దక్షిణాఫ్రికా - 38 
8. శ్రీలంక - 38
9. బంగ్లాదేశ్ - 14
10. జింబాబ్వే - 11


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.