close

తాజా వార్తలు

మాంచెస్టర్‌ మైదానంపై నుంచి విమానాలు బంద్‌

నోఫ్లై జోన్‌గా భారత్‌ X కివీస్‌ వేదిక

లండన్‌: ప భారత్‌ X న్యూజిలాండ్‌ తొలి సెమీఫైనల్‌ వేదికపై నో ఫ్లై జోన్‌ ఆంక్షలు విధిస్తున్నామని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల మాంచెస్టర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌ విముక్తి పేరిట సందేశాన్ని వేలాడదీస్తూ గుర్తు తెలియని విమానం చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీసీఐ మరోసటిరోజే ఐసీసీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

ఇలాంటివి జరగడం విచారకరమని తదుపరి మ్యాచ్‌ల్లో జరగకుండా చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరింది. ఈ విషయంపై స్పందించిన ఐసీసీ స్థానిక పోలీసులకు సమాచారమిచ్చామని, ప్రపంచకప్‌ సందర్భంగా ఇలాంటి వాటిని ఏమాత్రం సహించబోమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ మ్యాచ్‌ల నిర్వహణలో ఆయా స్టేడియాలపై నో ఫ్లైజోన్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. దీంతో భారత్‌ X న్యూజిలాండ్‌ వేదికపై ఆంక్షలు విధిస్తున్నామని ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు బీసీసీఐకి లేఖ రాసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.