
తాజా వార్తలు
దిల్లీ: ప్రపంచకప్ ఫైనల్లో విజేతను బౌండరీలతో నిర్ణయించడం సరికాదని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అభిప్రాయపడ్డాడు. బౌండరీలకు బదులుగా మరో సూపర్ ఓవర్‌ను ఆడించాలని పేర్కొన్నాడు. ప్రపంచకప్ ఫైనల్ విజేతను బౌండరీల లెక్కతో తేల్చడంపై ఇంకా వాదనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘సచిన్ చెప్పినట్లుగా ఫైనల్లో మరో సూపర్ ఓవర్‌ను ఆడించాలి. పరుగులు చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నప్పడు బౌండరీలనే ఎందుకు ప్రామాణికంగా తీసుకున్నారు? కోల్పోయిన వికెట్లను చూడటం ఎంతో ఉత్తమం.’ అని భరత్ తెలిపాడు. అంతేకాకుండా ఐపీఎల్ తరహాలో ప్లేఆఫ్స్‌ను ప్రపంచకప్‌లో అమలు చేయాలని అన్నారు. దీని వల్ల పట్టికలో అగ్రస్థానాల్లో నిలిచిన తొలి రెండు జట్లకు మేలు కలుగుతుందని తెలిపారు. భారత్ లీగ్దశలో పట్టికలో 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. కానీ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడటంతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. రెండో స్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా కూడా సెమీస్‌లో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- ఆంగ్లమాధ్యమంపై సంవాదం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
