Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145549
            [news_title_telugu_html] => 

మిస్బా ఉల్‌ హక్‌కు కీలక బాధ్యతలు!

[news_title_telugu] => మిస్బా ఉల్‌ హక్‌కు కీలక బాధ్యతలు! [news_title_english] => Misbah-ul-Haq as Pakistans coach-cum-chief selector [news_short_description] => పాకిస్థాన్‌ మాజీ సారథి మిస్బా ఉల్‌ హక్‌ను పాక్‌ జట్టు కోచ్‌గా‌, చీఫ్‌ సెలక్టర్‌గా నియమించడానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆసక్తి చూపిస్తోందని తెలుస్తోంది. ‘ప్రీ సీజన్‌ కండిషనింగ్‌ క్యాంప్‌లో ఉండటానికి మిస్బా అంత ఆసక్తితో లేడు. [news_tags_keywords] => Misbah-ul-Haq,Pakistan,PCB,Cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 13:11:09 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మిస్బా ఉల్‌ హక్‌కు కీలక బాధ్యతలు! - Misbah-ul-Haq as Pakistans coach-cum-chief selector - EENADU
close

తాజా వార్తలు

మిస్బా ఉల్‌ హక్‌కు కీలక బాధ్యతలు!

కరాచి: పాకిస్థాన్‌ మాజీ సారథి మిస్బా ఉల్‌ హక్‌ను పాక్‌ జట్టు కోచ్‌గా‌, చీఫ్‌ సెలక్టర్‌గా నియమించడానికి పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ‘ప్రీ సీజన్‌ కండిషనింగ్‌ క్యాంప్‌లో ఉండటానికి మిస్బా అంత ఆసక్తితో లేడు. పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డులో క్రియాశీలకంగా ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్‌ డైరెక్టర్‌ జాకీర్‌ ఖాన్‌ మిస్బాను ఒప్పించాడు. లీగ్‌ల్లో ఆడటానికి పీసీబీ పాక్ క్రికెటర్లకు అనుమతిచ్చినందుకు మిస్బా అసంతృప్తిగా ఉన్నాడు. కొందరు పాక్ క్రికెటర్లు ఫిటెనెస్‌ సమస్యలను ఎదుర్కొంటున్నారని అతడికి తెలుసు. వారిని లీగ్‌ల్లో ఆడటానికి అనుమతించే బదులుగా ఫిటెనెస్‌పై దృష్టి సారిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నాడు.’ అని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రపంచకప్‌ వరకు పాక్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా సేవలు అందించిన మిక్కీ ఆర్థర్‌ పదవీకాలం ముగియడంతో నూతన కోచ్‌ పదవికీ పీసీబీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుల గడువు ఆగస్టు 23తో ముగియనుంది. కోచ్‌ పదవికి మిస్బా ఇంకా దరఖాస్తు చేయలేదని సమాచారం. ప్రస్తుతం అతడు ప్రీ సీజన్‌ కండిషనింగ్‌ క్యాంప్‌లో ఉన్నాడు.

పాకిస్థాన్‌ తరఫున అన్ని ఫార్మాట్లకు మిస్బా కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతడి సారథ్యంలోనే పాకిస్థాన్‌ టెస్టుల్లో తొలిసారి మొదటి ర్యాంక్‌ సాధించింది. పాక్‌ తరఫున 76 టెస్టులు, 162 వన్డేలు, 39 టీ20లు ఆడాడు. 2015లో వన్డేలకు గుడ్‌బై చెప్పిన అతడు 2017లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.