Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146706
            [news_title_telugu_html] => 

రహానె సెంచరీ ఎందుకు కొట్టలేదు?

[news_title_telugu] => రహానె సెంచరీ ఎందుకు కొట్టలేదు? [news_title_english] => Not concerned about hundred says Ajinkya Rahane [news_short_description] => భారత్‌-విండీస్‌ మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె అదరగొట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ ఆత్మన్యూనతకు లోను కాకుండా 81 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శతకానికి కాస్త దూరంలో పెవిలియన్‌ చేరినప్పటికీ వంద...... [news_tags_keywords] => Ajinkya Rahane,Teamindia,INDvsWI [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 12:20:49 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రహానె సెంచరీ ఎందుకు కొట్టలేదు? - Not concerned about hundred says Ajinkya Rahane - EENADU
close

తాజా వార్తలు

రహానె సెంచరీ ఎందుకు కొట్టలేదు?

అదిరిపోయే సమాధానమిచ్చిన టీమిండియా వైస్‌కెప్టెన్‌ 

ఆంటిగ్వా: భారత్‌-విండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజున టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రహానె అదరగొట్టాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ  81 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శతకానికి కాస్త దూరంలో పెవిలియన్‌ చేరినప్పటికీ వంద పరుగుల కంటే విలువైన ప్రదర్శనే చేశాడు. తొలిరోజు మ్యాచ్‌ పూర్తయిన వెంటనే మీడియాతో మాట్లాడాడు. రహానె శతకం సాధించి రెండేళ్లయింది. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో చేసిన శతకమే చివరిది. అప్పటి నుంచి అతడికి మూడంకెల స్కోరు అందని ద్రాక్షలా మారంది. దీంతో మీడియా ఈ ప్రశ్న వేయగా అదిరిపోయే సమాధానం ఇచ్చాడు.

‘ఈ ప్రశ్న వేస్తారని ముందే ఊహించాను. సమాధానం చెప్పడానికి సిద్ధంగా కూడా ఉన్నాను. శతకం చేయలేదని బాధ లేదు. సెంచరీ కొట్టి మైలురాళ్లు సాధించాలన్న ఆతృతా లేదు. నేను జట్టుకోసం ఆడుతున్నాను. వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండటమే ముఖ్యం. కాబట్టి శతకం గురించి ఆలోచించడం లేదు. గత కొంతకాలంగా జట్టులో నా ప్రదర్శన చూస్తే అది మీకే తెలుస్తుంది. జట్టు 25/3 సమయంలో శతకం గురించి ఆలోచించడం కంటే జట్టు గురించి ఆలోచిస్తే బాగుంటుంది’అని అన్నాడు.

టీ20, వన్డేల్లో మెరుపులు మెరిపించిన టీమిండియా ఆటగాళ్లకు తొలి టెస్టులో గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించారు. భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(81; 163బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(44; 97బంతుల్లో 5×4) రాణించడంతో భారత్‌ మొదటి రోజు  68.5 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.