close

తాజా వార్తలు

చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

పుణె: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 137 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో టీమ్ఇండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీసులు గెలిచిన ఏకైక జట్టుగా కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. 2012/13 నుంచి భారత్‌ స్వదేశంలో ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోలేదు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 1994/95 నుంచి 2000/01 మధ్యలో ఆసీస్‌ సొంతగడ్డపై వరుసగా 10 టెస్టు సిరీసులు గెలుచుకుంది. పుణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సారథిగా కోహ్లీ తన ఖాతాలో మరికొన్ని రికార్డులు వేసుకున్నాడు.

* 50 టెస్టులు సారథిగా బాధ్యతలు నిర్వహించిన కెప్టెన్లలో అత్యధిక విజయాలు సాధించిన మూడో ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. స్టీవ్‌వా (37), రికీ పాంటింగ్‌ (35) తొలి రెండు స్థానాల్లో ఉండగా కోహ్లీ (30) మూడో  స్థానంలో ఉన్నాడు.  

* భారత్‌ తరఫున అత్యధికంగా ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో విజయం సాధించిన రెండో సారథిగా విరాట్‌ కోహ్లీ (8) రికార్డు సృష్టించాడు. తొమ్మిది సార్లు ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో జట్టును గెలిపించిన ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. 

* సొంతగడ్డపై వరుసగా అత్యధిక టెస్టు సిరీసులు గెలిచిన మూడో కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కోహ్లీ 9 టెస్టు సిరీసులు గెలవగా రికీ పాంటింగ్‌, మార్క్‌ టేలర్‌ 10 సిరీసుల్లో విజయం సాధించారు. 

* దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధించిన భారత కెప్టెన్‌ కోహ్లీనే. అంతకుముందు ఈ రికార్డు ధోనీ పేరిట ఉండేది. ధోనీ నాయకత్వంలో టీమ్‌ఇండియా 2010లో సఫారీసేనను ఇన్నింగ్స్‌ 57 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

* ఈ మ్యాచ్‌లో ద్విశతకం బాదిన కోహ్లీ భారత్‌ తరఫున అత్యధిక డబుల్‌సెంచరీలు బాదిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా భారత సారథుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కెప్టెన్‌ కోహ్లీనే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.