close

తాజా వార్తలు

ప్రతి కెప్టెన్‌ ఆశించేది ఇదే: కోహ్లీ

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన భారత్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 300 పాయింట్లను సాధించింది. మ్యాచ్‌ అనంతరం భారత సారథి విరాట్‌ కోహ్లీ మాట్లాడాడు. టీమ్‌ఇండియా బౌలింగ్‌ దళం అద్భుతంగా ఉందని కొనియాడాడు. భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపాడు.

‘ఆటగాళ్లంతా గొప్పగా పోరాడారు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టారు. పేసర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మ్యాచ్‌పై పట్టు సాధించాం. ప్రస్తుతం మా బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉంది. బుమ్రా తిగిగి జట్టులోకి వచ్చాక మరింత దుర్భేద్యంగా మారుతుంది. ప్రతి సారథి జట్టులో ఇలాంటి బౌలింగ్‌ దళమే ఉండాలని కోరుకుంటాడు. రికార్డులపై మేం దృష్టి సారించట్లేదు. భారత క్రికెట్‌ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాం. భారీ స్కోరు చేయడం ఎంతో ముఖ్యం. మయాంక్‌ చక్కగా ఆడాడు. డే/నైట్‌ టెస్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాం. భారత క్రికెట్‌ చరిత్రలో కోల్‌కతా టెస్టు నిలిచిపోతుంది’ అని కోహ్లీ పేర్కొన్నాడు. బంగ్లాపై ద్విశతకం బాదిన మయాంక్‌ అగర్వాల్‌ (243) మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ను అందుకున్నాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆఖరి టెస్టు కోల్‌కతా వేదికగా నవంబర్‌ 22న ప్రారంభం కానుంది.  


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.