close

తాజా వార్తలు

కేంద్ర మంత్రుల్లో భారీ విజయాలు.. ఓటములు

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ ఛరిష్మా అద్భుతంగా పనిచేసింది. గతంలో ఓటమి పాలైన మంత్రులు కూడా ఈ సారి దిగ్గజాలను మట్టికరిపించారు. ఆయన మంత్రి వర్గంలో అత్యధిక మంది సహచరులు మంచి మెజార్టీలతో ఎన్నికై లోక్‌సభలో తిరిగి అడుగుపెట్టారు. అదే క్రమంలో కొద్ది మంది కేంద్ర మంత్రులు ఓటమిని కూడా చవిచూశారు. కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌ ఏకంగా 5లక్షలకు పైగా మెజార్టీని సాధించారు. 

* గతంలో ఓటమి పాలైనా మోదీ మంత్రి వర్గంలో స్థానం దక్కించుకొన్న స్మృతి ఇరానీ  ఈసారి సత్తా చాటారు. ఆమె ఏకంగా కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేఠీలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఏకంగా 55 వేల ఓట్ల తేడాతో ఓడించారు. బాగా అర్ధరాత్రి తర్వాత ఈ ఎన్నికల ఫలితం వెలువడింది. కేంద్ర మంత్రుల్లో అత్యంత కఠిన పరీక్షను స్మృతి ఇరానీనే ఎదుర్కొన్నారు. ఆమె రాహుల్‌ ఓడించడం ద్వారా జెయింట్‌ కిల్లర్‌గా ఎదిగారు. 
* ఇక ప్రధాని మోదీ వారణాసి నుంచి దాదాపు 4,79,505 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.  గతంలో మెజార్టీ కంటే ఇది ఎక్కువ.
* కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌ తన సమీప ప్రత్యర్థి ఎస్పీ అభ్యర్థి సురేష్‌ బన్సల్‌పై 5,01,500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
* జైపూర్‌ రూరల్‌ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ తన సమీప ప్రత్యర్థి క్రిష్ణ పూనియాపై 3.93లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. వీరిద్దరూ ఒలింపిక్స్‌లో భారత్‌ తరపున ప్రాతినిధ్యం వహించిన వారే కావడం విశేషం.
* బికనేర్‌లో కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ 2.5లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు.
* అనంతకుమార్‌ హెగ్దే ఉత్తరాఖండ్‌ నుంచి జేడీఎస్‌ అభ్యర్థి ఆనంద్‌పై 4.79 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 
* కేంద్ర మంత్రి మహేష్‌శర్మ నోయిడాలోని గౌతమ్‌ బుద్ధానగర్‌లో 3.3లక్షల ఓట్ల మెజార్టీ సాధించారు. 
* బిహార్‌లోని బెగుసరైలో కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సీపీఐ అభ్యర్థి కన్నయ్య కుమార్‌ను 4,22,217 ఓట్ల తేడాతో ఓడించారు. 
* పుర్వి చంపారన్‌లో వ్యవసాయ శాఖ మంత్రి రాధ మోహన్‌ సింగ్‌ తన ప్రత్యర్థి ఆకాష్‌ సింగ్‌పై దాదాపు 2 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
* కేంద్ర మంత్రి ఆర్‌.కె.సింగ్‌ అర్రహ నియోజకవర్గంలో సమీప ప్రత్యర్థి రాజు యాదవ్‌పై 1,47,285 ఓట్ల తేడాతో గెలుపొందారు. 
* పట్నా సాహెబ్‌ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ తన ప్రత్యర్థి శతృఘ్న సిన్హాపై 2,84,657  ఓట్ల తేడాతో విజయం సాధించారు.
* బక్సర్‌ నియోజక వర్గంలో ఆర్‌జేడీ అభ్యర్థి జగదానంద సింగ్‌పై కేంద్ర మంత్రి అశ్విన్‌కుమార్‌ చౌబే 1,17,609 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
* కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లఖ్‌నవూ నియోజకవర్గంలో 3.47లక్షల ఓట్ల మెజార్టీతో ఎస్పీ అభ్యర్థి పూనమ్‌ సిన్హాపై విజయం సాధించారు.  
* కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ నాగ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి 2.13లక్షల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి నానాపటోలేని ఓడించారు. 

భారీ ఓటములు..
* కేంద్ర పర్యటక శాఖ మంత్రి కె.జె.ఆల్ఫోన్స్‌ ఎర్నాకులంలో ఓడిపోయారు. ఆయన ఇక్కడ మూడోస్థానానికి పరిమితం కావడం విశేషం. ఈ స్థానాన్ని సీపీఎంకు చెందిన హిబి ఈదెన్‌ 1.69 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
* మరో కేంద్ర మంత్రి హర్దీప్‌ పురి అమృత్‌సర్‌లో 99 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్జిత్‌ సింగ్‌ విజయం సాధించారు. 
* రైల్వే మంత్రి మనోజ్‌ సిన్హా ఘజియాపూర్‌లో 1.19లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ విజయం సాధించారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.