
తాజా వార్తలు
హైదరాబాద్: కోట్ల రూపాయలు ఖర్చు చేసి సచివాలయం, అసెంబ్లీలకు కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం లేదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. నాంపల్లిలోని తెజస కార్యాలయంలో సచివాలయం కూల్చివేత, పార్టీ ప్లీనరీ అంశాలపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉస్మానియా వైద్యశాల, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు వసతులు మెరుగుపర్చాలని ప్రభుత్వానికి సూచించారు. సంక్షేమ హాస్టళ్ల భవనాలు నిర్మిస్తామని రూ.1800 కోట్లు బడ్జెట్లో కేటాయింపులు చూపినా.. అందుకోసం రూ.400 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నది, శ్రీశైలం ప్రాజెక్టుకు అదనంగా ఒక్కచుక్క నీరు కలిపినా మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా వాటా ఇవ్వాల్సి ఉంటుందని కోదండరాం పేర్కొన్నారు. కృష్ణానది మీద భారం తగ్గించేలా ప్రాజెక్టులు కట్టాలన్నారు. నదుల అనుసంధానం పేరుతో విభజన సమస్యలు పక్కన పెడుతున్నారని ఆక్షేపించారు. ఉద్యోగుల విభజన జరగక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జూలై 13న తెజస ప్లీనరీ హైదరాబాద్‌లో ఉంటుందని ఈ సందర్భంగా కోదండరాం తెలిపారు. పార్టీ ఫిరాయింపులతో రాజకీయాలు భ్రష్టు పట్టాయన్నారు. ప్రజల అవసరాల కోసం రాజకీయాలు మారాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెజస సొంతంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. నగరంలో ఒక్క వాన పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయని విమర్శించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
