Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144609
            [news_title_telugu_html] => 

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు కొత్తగా ఉన్నాయి..  

[news_title_telugu] => కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు కొత్తగా ఉన్నాయి..   [news_title_english] => Chidambaram criticised govt on Kashmir issue [news_short_description] => జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో నెలకొన్న సాధారణ పరిస్థితులు కొత్తగా ఉన్నాయంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇంటర్నెట్‌ సేవలు స్తంభించిపోయినప్పటికీ...... [news_tags_keywords] => Chidambaram, Congress, Kashmir Issue [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 21:25:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు కొత్తగా ఉన్నాయి..   - Chidambaram criticised govt on Kashmir issue - EENADU
close

తాజా వార్తలు

కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు కొత్తగా ఉన్నాయి..  

దిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితులపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌లో నెలకొన్న సాధారణ పరిస్థితులు కొత్తగా ఉన్నాయంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఇంటర్నెట్‌ సేవలు స్తంభించిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సాధారణ పరిస్థితులే ఉన్నాయని చెబుతోందని మండిపడ్డారు. తననెందుకు గృహనిర్బంధం చేశారని మహబూబాముఫ్తీ కుమార్తె ప్రశ్నిస్తే ఆమెకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందని విమర్శించారు. ‘‘కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి... పాఠశాలలు తెరుచుకున్నాయి.. విద్యార్థులు మాత్రం రాలేదు. కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. ఇంటర్నెట్‌ సేవలు కూడా మరోసారి స్తంభించాయి. మహబూబా ముఫ్తీ కుమార్తె తననెందుకు నిర్బంధించారో చెప్పమంటే సమాధానం లేదు.  కశ్మీర్‌లో నెలకొన్న కొత్త సాధారణ పరిస్థితులు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి’’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌లో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. అలాగే, జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో పాటు రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. అయితే, జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని.. జనజీవనం మామూలు స్థితికి చేరుకుంటోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని చిదంబరం ట్విటర్‌లో పలు విమర్శలు సంధించారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.