close

తాజా వార్తలు

పడవ ప్రమాదం.. 9కి చేరిన మృతులు

పడవ ప్రమాదం.. 9కి చేరిన మృతులు

భువనేశ్వర్‌: ఒడిశా పడవ ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఒడిశాలోని పర్యాటక  ప్రాంతం హుక్కితలకు ప్రయాణికులతో వెళ్లి తిరిగి వస్తున్న ఓ నాటు పడవ బుధవారం రాత్రి కేంద్రపడ జిల్లా నిప్పానియా వద్ద మహానది ముఖద్వారం వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. గల్లంతైన మరొకరి కోసం గాలిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. మృతులంతా జగత్‌సింగ్‌పూర్‌ జిల్లా కుజంగా వాసులుగా పోలీసులు గుర్తించారు. నిప్పానియా గ్రామం వద్ద పడవ దిగే సమయంలో అందరూ ఒకవైపు రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా సమయంలో పడవలో 55 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ రూ. 4లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

పడవ ప్రమాదం.. 9కి చేరిన మృతులు

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.