
తాజా వార్తలు
న్యూదిల్లీ: భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఆయనకు భాజపా నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ‘రాహుల్ గాంధీ దృష్టంతా భాజపాపైనే ఉంది. ఆయన అసలు దేశం గురించి ఆలోచిస్తున్నారా? ఒకవేళ ఆయన ఈ విషయంపై దృష్టి పెడితే ఆయన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో దేశ ప్రజలకు తెలిసి ఉండేవి. రాహుల్ ప్రభావవంతమైన నాయకుడు కాదు. ఆయనకు ఓ విజన్ ఉన్నప్పటికీ.. ఆయన సమర్థతపై ప్రశ్నలు తలెత్తుతాయి. అమేఠీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో దేశం మొత్తానికి తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
‘ఓ వైపు సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది. న్యూ ఇండియా రూపకల్పనలో అన్ని విషయాలపై స్పష్టతతో ఉంది. మరోవైపు ప్రకటనలకే పరిమితమయ్యే రాహుల్ గాంధీ ఉన్నారు’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. కాగా, భాజపా మేనిఫెస్టోను తలుపులు మూసేసి ఉంచిన ఓ గదిలో రూపొందించారని, అది అహంకారపూరితంగా ఉందని, దాన్ని దీర్ఘ దృష్టితో రూపకల్పన చేయలేదని రాహుల్ గాంధీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో రాహుల్‌పై స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- ఫ్యాన్ మృతిపట్ల చెర్రీ ఆవేదన..వీడియో వైరల్
- రేషన్ జాబితా నుంచి వారిని తొలగించొద్దు
- నాగేశ్వరరావు న్యాయం చేయలేడన్నారు!
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- వాహనాల విక్రయాలు.. మళ్లీ తగ్గాయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
