close

తాజా వార్తలు

ఓడినప్పటికీ అమేఠీలోనే ఉన్నాను..

రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ విమర్శలు

అమేఠీ (ఉత్తర్‌ప్రదేశ్‌): కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన నియోజక వర్గం అమేఠీకి ప్రాధాన్యతనివ్వడం లేదని కేంద్ర మంత్రి, భాజపా నేత స్మృతి ఇరానీ ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచార ర్యాలీలో పాల్గొన్న ఆమె... ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘గత లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసి గెలిచిన వ్యక్తి, ఇప్పుడు కేరళలోని వయనాడ్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. ఆయన మొదట ఆ లోక్‌సభ స్థానానికి వెళ్లి నామినేషన్‌ వేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన నేను మాత్రం ఇప్పటికీ మీతోనే ఉన్నాను. 2014లో రాహుల్‌ ఇక్కడి నుంచి గెలిచినప్పటికీ, మొదటి ప్రాధాన్యతను వయనాడ్‌కే ఇస్తున్నారు. ఆ స్థానం తర్వాతే అమేఠీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అమేఠీ ప్రజలు ఈ అవమానాన్ని సహిస్తారా?’ అని వ్యాఖ్యానించారు. 

‘నామినేషన్‌ దాఖలు చేయడానికి అమేఠీ ఎంపీ రాహుల్‌ ఈ రోజు ఇక్కడకు వచ్చారు. అనంతరం తనకు ఓట్లు వేయమని కూడా ఆయన ప్రజలను అడగలేదు. ఈ ప్రాంత ప్రజలకు ఇది అవమానకరం. నేను గురువారం నామినేషన్‌ దాఖలు చేస్తాను. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఆ సమయంలో నా వెంట ఉంటారు’ అని స్మృతి ఇరానీ తెలిపారు. కాగా, అమేఠీలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి. ఆ నియోజక వర్గంలో రాహుల్‌కి పోటీగా స్మృతి ఇరానీ నిలిచారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారంలో పాల్గొంటూ ఆమె బిజీగా ఉంటున్నారు.  
 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.