close

తాజా వార్తలు

ఈనెల 21న ‘పుర’ పోలింగ్‌ కేంద్రాల జాబితా

హైదరాబాద్‌: తెలంగాణలో పురపాలక ఎన్నికల కోసం పోలింగ్‌ కేంద్రాల ప్రకటన తేదీ వాయిదా పడింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈనెల 16న ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించిన అనంతరం 21న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను వెల్లడించనున్నారు. 3 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఈనెల 21 పోలింగ్‌ కేంద్రాల జాబితాను ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు ఎన్నికల పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ భేటీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి, మున్సిపల్‌ శాఖ డైరెక్టర్ శ్రీదేవి హాజరయ్యారు. పుర ఎన్నికల నిర్వహణపై పరిశీలకులతో చర్చించారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.