close

తాజా వార్తలు

దసరా కల్లా భవనాలు పూర్తి కావాలె: కేసీఆర్‌

జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంపై నేతలకు దిశానిర్దేశం

హైదరాబాద్‌: దసరా నాటికి పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయాలని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పార్టీ నేతలకు నిర్దేశించారు. తెలంగాణభవన్‌లో తెరాస ముఖ్య నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కార్యాలయాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించారు.

అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించాలని తెరాస నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 29 జిల్లాల్లో శంకుస్థాపనలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సంబంధించిన బాధ్యులకు ఇవాళ చెక్కులు అందజేశారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.60 లక్షల చెక్కును, భవన నిర్మాణ ప్రణాళికను అందించారు. నిబంధనలు ఉల్లంఘించకుండా నిర్మాణం పూర్తి చేయాలని ఈ సందర్భంగా నేతలకు కేసీఆర్‌ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదుపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలన్నారు. గ్రామ కమిటీల ఏర్పాటు కూడా ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పోడు భూముల వ్యవహారాన్ని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పోడు రైతులను అటవీ శాఖ అధికారులు వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. త్వరలో వీటన్నింటినీ పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.