close

తాజా వార్తలు

అమ్మలా అన్నం తినిపిస్తుంది!

దిల్లీ: చేతుల్లేని దివ్యాంగులు, చేతులు పనిచేయనివారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఆహారం తీసుకోవడానికి ఉపయోగపడే సరికొత్త పరికరాన్ని ఐఐటీ-గాంధీనగర్‌ విద్యార్థులు క్రిస్‌ ఫ్రాన్సిస్‌, ప్రవీణ్‌ వెంకటేశ్‌ అభివృద్ధి చేశారు. మౌఖిక ఆదేశాల(వాయిస్‌ కమాండ్‌)కు అనుగుణంగా పనిచేసే ఈ పరికరానికి ‘ఫుడ్‌బడ్డీ’గా నామకరణం చేశారు. వ్యక్తుల ఆదేశాల ప్రకారం ‘ఫుడ్‌బడ్డీ’లోని స్పూను పైకి, కిందికి కదులుతుంది. ప్లేటులోని ఆహారాన్ని వ్యక్తుల నోటికి అందిస్తుంది. ‘గూగుల్‌ అసిస్టెంట్‌’, ‘అమెజాన్‌ అలెక్సా’ల ద్వారా ఈ పరికరానికి వాయిస్‌ కమాండ్‌లు అందించవచ్చు. ‘ఫుడ్‌బడ్డీ’ ధర రూ.2,000 నుంచి రూ.3,000 మధ్య ఉండే అవకాశముంది. దానిపై పేటెంట్‌ కోసం ఫ్రాన్సిస్‌, వెంకటేశ్‌ దరఖాస్తు చేసుకున్నారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.