Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144486
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ - 1PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ - 1PM [news_title_english] => one pm news [news_short_description] => [news_tags_keywords] => top10,news,1pm [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 12:59:14 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ - 1PM - one pm news - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 1PM

1. వైద్యవిద్య ప్రవేశాలకు హైకోర్టు పచ్చజెండా

తెలంగాణలో వైద్యవిద్య ప్రవేశాల ప్రక్రియకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి రిజర్వేషన్‌ కోటా సీట్ల భర్తీపై దాఖలైన పిటిషన్‌లను కొట్టివేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల కేటాయింపు ప్రక్రియలో ఇటీవల వివాదం ఏర్పడింది. ఇప్పటికే మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తవ్వగా.. రెండో విడత ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది విద్యార్థులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. శాంతించిన కృష్ణమ్మ

కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణానదికి వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 3.54 లక్షల క్యూసెక్కులుకాగా.. 21 గేట్లద్వారా 3.39 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 8.434 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 317.910  మీటర్లకుగానూ.. ప్రస్తుతం 213.516 మీటర్లుగా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. డ్రోన్‌ ఘటన అనుమానాలకు తావిస్తోంది!

తెదేపా అధినేత చంద్రబాబు నివాసంపై డ్రోన్‌ ఎగురవేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఆ పార్టీ నేతలు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. నాలుగు పేజీల లేఖను గవర్నర్‌కు అందజేశారు. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చంద్రబాబు భద్రతను కుదించిన ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల తర్వాత తిరిగి భద్రతను పెంచడాన్ని తెదేపా నేతలు ఈ సందర్భంగా గవర్నర్‌కు గుర్తు చేశారు. వైకాపా ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు పూనుకొంటోందని, డ్రోన్‌ ఎగరవేస్తూ పట్టుబడిన వ్యక్తి జగన్‌ నివాసంలో ఉండే కిరణ్‌ ఆదేశాలమేరకే చిత్రీకరించానని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని తెదేపా నేతలు గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఏపీ ఎక్సైజ్‌ శాఖలో సమ్మెలు నిషేధం

ఆంధ్రప్రదేశ్‌ ఎక్సైజ్‌ శాఖలో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో మద్యం రిటైల్‌ దుకాణాల నిర్వహణక ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి నూతన మద్యం విధానాన్ని ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమ్మె నిషేధ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. తరుణ్‌ తేజ్‌పాల్‌పై విచారణ కొనసాగాల్సిందే

తెహల్కా మ్యాగజైన్‌ వ్యవస్థాపకుడు, ప్రముఖ జర్నలిస్టు తరుణ్‌ తేజ్‌పాల్‌పై వచ్చిన అత్యాచార ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వాటిపై విచారణ కొనసాగాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో తనపై నమోదైన అభియోగాలను కొట్టివేయాలంటూ తేజ్‌పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నాత న్యాయస్థానం తిరస్కరించింది. అంతేగాక.. తరుణ్‌ తేజ్‌పాల్‌ కేసులో ఆరు నెలల్లోగా విచారణ పూర్తిచేయాలని గోవా న్యాయస్థానాన్ని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కోహ్లీ 11 ఏళ్ల ప్రయాణంపై భావోద్వేగం

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి  11 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన ట్విటర్‌లో భావోద్వేగపూరిత పోస్టు పెట్టాడు. 2008లో కుర్రాడిగా భారత జట్టులో అడుగుపెట్టిన తాను.. 11 ఏళ్ల ప్రయాణంలో ఇంత సాధిస్తానని కలలో కూడా ఊహించలేదని చెప్పాడు. దేవుడి ఆశీస్సుల వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని అన్నాడు. అలాగే సరైన మార్గంలో తమ కలలను సాకారం చేసుకోవాలని, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకోవాలని కోహ్లీ.. అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. 51ఏళ్ల క్రితం గల్లంతైన విమాన శకలాలు లభ్యం

ఐదు దశాబ్దాల క్రితం గల్లంతైన ఓ భారత వాయుసేన విమాన శకలాలు తాజాగా లభ్యమయ్యాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహుల్‌ - స్పితి జిల్లాలో గల ఢాకా గ్లేషియర్‌లో ఏఎన్‌-12 బీఎల్‌-534 విమాన శకలాలను అధికారులు గుర్తించారు. 1968 ఫిబ్రవరి 7న 98 మంది రక్షణశాఖ సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం రోహ్తంగ్‌ పాస్‌ మీదుగా వెళ్తుండగా కంట్రోల్‌ రూంతో సంబంధాలు తెగిపోయాయి. అయితే గతేడాది జులైలో విమానానికి సంబంధించిన కొన్ని శకలాలు ఢాకా గ్లేషియర్‌లో పడినట్లు వార్తలు రావడంతో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ సంయుక్తంగా మరోసారి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఆదివారం విమానానికి సంబంధించిన ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. శ్రుతి మించిన ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యలు

కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ అంశంగా చూపడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమైన పాకిస్థాన్‌ మరో కొత్త వాదనకు తెరలేపింది. కశ్మీర్‌ అంశంపై ఇక తమ వాదనలు చెల్లవని భావించారో ఏమో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవగాహన లేకుండానే ఎన్‌ఆర్‌సీ, అణ్వస్త్ర విధానంపై వ్యాఖ్యానించారు. భారత్‌లోని అణ్వస్త్రాల భద్రతను శంకించిన ఆయన.. అంతర్జాతీయ సమాజం కలగజేసుకోవాలని ప్రాధేయపడ్డారు. మోదీ ప్రభుత్వం పాక్‌తో పాటు ప్రాంతీయంగా ముప్పు కలగజేస్తోందని నిరాధార ఆరోపణలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మైమరపిస్తున్న కోణం జలాశయం

10. లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 332, నిఫ్టీ 89 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 71.28గా ఉంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.