close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఏపీలో ‘పెళ్లికానుక’ పేరు మార్చిన ప్రభుత్వం

పథకాల పేర్లు మార్పులో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన చంద్రన్న పెళ్లి కానుక పథకం పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఈ పథకాన్ని వైఎస్సార్‌ పెళ్లికానుకగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లను మారుస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తెలంగాణ పచ్చగా ఉండటం వారికి నచ్చడంలేదు

క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలే తెరాస బలమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఇప్పటి వరకు 50 లక్షల మంది తెరాస సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని  కూకట్‌పల్లిలో నిర్వహించిన నియోజవర్గ తెరాస విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం బాగుపడుతుంటే కొందరికి నచ్చడం లేదని మండిపడ్డారు. తెలంగాణ పచ్చగా ఉండటం కాంగ్రెస్‌, భాజపా నాయకులకు నచ్చడం లేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. తన సోదరుడు డేవిడ్‌ రాజు హత్య కేసులో కేఏ పాల్‌ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణకు మిగతా నిందితులు న్యాయస్థానానికి హాజరైనప్పటికీ కేఏ పాల్‌ హాజరుకాలేదు. దీంతో మహబూబ్‌నగర్‌ న్యాయస్థానం నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ‘చంద్రబాబు ఇంటిని ముంచాలనే ఆలోచన లేదు’

2009 తర్వాత రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఎప్పుడూ వరదలు రాలేదని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ చెప్పారు. సరైన సమయంలోనే వరదనీటిని దిగువకు వదిలామన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఉంటున్న ఇంటిని ముంచాలనే ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. కశ్మీర్‌ అంశంలోకి మమ్మల్ని లాగొద్దు

పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌ మండిపడింది. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అఫ్గాన్‌కు జోడించి మాట్లాడటం ఆపేయాలని ఆ దేశానికి హితవు పలికింది. ఈమేరకు అమెరికాకు అఫ్గానిస్థాన్ అంబాసిడర్‌ రోయా రహ్మానీ ఓ లేఖను ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. తమ దేశంపై పాక్‌ అర్థరహితంగా, బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతోందని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. నదిలో చిక్కుకున్న వారిని రక్షించిన వైమానిక దళం

7. పోలీసుల ఆయుధాలను ఎవరూ సీజ్ చేయలేదు

జమ్మూ కశ్మీర్‌లోని కొందరి ప్రత్యేక పోలీసు అధికారుల ఆయుధాలను సీజ్‌ చేశారంటూ వస్తున్న వార్తలను సమాచార, ప్రజాసంబంధాల విభాగం(డీఐపీఆర్‌) తోసి పుచ్చింది. ఉద్దేశపూర్వకంగా ఇలాంటి నకిలీ వార్తలను ఎవరో సృష్టిస్తున్నారని తెలిపింది. ఈ మేరకు డీఐపీఆర్‌ వరుస ట్వీట్లు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. గవర్నర్‌ నరసింహన్‌కు స్వల్ప అస్వస్థత

తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. సతీమణి విమలతో కలిసి బిహార్‌లోని గయ పర్యటనకు వెళ్లిన ఆయన సోమవారం అకస్మాత్తుగా వాంతులతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను సమీపంలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ముందు జాగ్రత్తగా రక్తపరీక్ష, ఈసీజీ నిర్వహించారు. ఎలాంటి సమస్యా లేదని నిర్ధారించుకున్న తర్వాత గవర్నర్‌ అక్కడి నుంచి దిల్లీ వెళ్లారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. ఎయిమ్స్‌కు ఆడ్వాణీ: జైట్లీ ఆరోగ్యంపై ఆరా

తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్‌లో చికిత్సపొందుతున్న కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీని భాజపా అగ్రనేత ఎల్‌కే ఆడ్వాణీ పరామర్శించారు. సోమవారం మధ్యాహ్నం ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి చేరుకొని జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అరుణ్‌ జైట్లీ ఆరోగ్యం విషమించడంతో ఆయనను ప్రాణాధార వ్యవస్థపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను ఆరా తీస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. చివరి గంట.. లాభాలు తుడిచెనంట

దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. నేటి ప్రారంభ ట్రేడింగ్‌లో100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ ఒక దశలో 300 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 11,100 మార్క్‌ పైన కదలాడింది. అయితే చివరి గంటల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా లాభాల్లో చాలా వరకు కోల్పోవాల్సి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.