close

తాజా వార్తలు

ఆ తల్లి విధివంచిత

విద్యుదాఘాతానికి గురైన కుమారుడి మృతి
ముగ్గురు కుమారులనూ పొట్టన బెట్టుకున్న ప్రమాదాలు


కుమారుడు ప్రమాదానికి గురైనప్పుడు రోదిస్తున్న తల్లి(దాచిన చిత్రం)

లింగాలవలస(టెక్కలి పట్టణం), న్యూస్‌టుడే : ఆ తల్లి గర్భశోకం తీరనిది. కటిక పేదరికం వెంటాడినా పేగుబంధంతో పెంచిన ముగ్గురు కుమారులను ఆమె కళ్లెదుటే కోల్పోయింది. పగబట్టిన విధి ప్రమాదాల రూపంలో వెంటాడింది. ఒకరి వెంట ఒకరిని కబళించుకుపోయింది. మిగిలిన ఒక్క మగదిక్కు కోల్పోయింది. తలకొరివి పెట్టాల్సిన కుమారుడు కాటికి వెళ్లి పోతుంటే ఆ తల్లి గుండె రోదనకు అంతే లేకుండా పోయింది. లింగాలవలస సమీపంలో అక్టోబరు 30వ తేదీన పశువులను మేపేందుకు వెళ్లి చవితి పువ్వులు ఏరుతుండగా విద్యుదాఘాతంతో తీవ్రంగా గాయపడిన వ్యవసాయ కార్మికుడు బడబందల అప్పన్న (40) మంగళవారం ఉదయం విశాఖపట్నం లోని కేజీహెచ్‌లో మృతిచెందాడు. వారం రోజులపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలొదిలాడు. అయితే ఇతడి మరో ఇద్దరు సోదరులు కూడా ప్రమాదాల్లోనే మృతిచెందడాన్ని గుర్తు చేసుకుని గ్రామస్థులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లి రాధమ్మ గర్భశోకం తీరేదెలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దకుమారుడు సీతారాం భవననిర్మాణ పనుల కోసం నెల్లూరు వెళ్లి విద్యుదాఘాతానికి గురై 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. 10 నెలల క్రితం భవననిర్మాణ మేస్త్రీగా పనిచేస్తున్న చిన్నకుమారుడు చంద్రరావు గంగాధరపేట సమీపంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టులో ద్విచక్రవాహనంతో సహా పడి చనిపోయాడు. తాజాగా రెండో కుమారుడు అప్పన్న కూడా విద్యుదాఘాతంతో మృతిచెందడంతో కుటుంబం ఉన్న ఒక్క మగ దిక్కునూ కోల్పోయింది. అప్పన్నకు భార్య సుజాత, ఇంటర్‌ చదువుతున్న కుమార్తె స్వాతి, ఆరో తరగతి చదువుతున్న కుమారుడు బాబి ఉన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బుధవారం గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.

బడబందల అప్పన్న (దాచిన చిత్రం)


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.